తాళి కట్టి జంప్ అయిన షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్: తలపట్టుకున్న వధువు!..

Subscribe to Oneindia Telugu

జూపాడు బంగ్లా: వేదమంత్రోచ్చరణల మధ్య.. బంధుమిత్రుల సమక్షంలో వధువు మెడలో తాళికట్టిన వరుడు.. ఆ తర్వాత కొద్దిసేపటికే అదృశ్యమైపోయాడు. ఎక్కడికెళ్లాడోనని రాత్రంతా కంగారుపడ్డ ఇరు వర్గాలు.. గురువారం ఉదయం పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలోని జూపాడుబంగ్లాకు చెందిన వెంకటస్వామి కుమార్తె మోతెలక్ష్మికి తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన రమణమ్మ, నరసింహ దంపతుల ప్రథమ పుత్రుడు కొడిగంటి కురుమూర్తితో బుధవారం ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి తంతు, విందు పూర్తయ్యాక.. కొత్త జంటను తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

bridegroom flees from marriage hall

ఆ సమయంలో.. ఎవరి హడావుడిలో వారు ఉండగా.. వరుడు ఎవరికి చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయాడు. వరుడి అదృశ్యంతో వధువు కుటుంబంలో ఆందోళన పెరిగింది. రాత్రంతా వేచి చూసినా.. అతను మాత్రం తిరిగిరాలేదు. ఫోన్ చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ లో వధువు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా పనిచేసే కురుమూర్తికి గతంలోనే ఓ వివాహమైందని, కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో ఇతనిపై కేసు కూడా నమోదైందని కొంతమంది బంధువులు పేర్కొనడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A bridegroom was escaped from marriage hall in Kurnool district. Bride family lodged a complaint in local police station regarding his missing
Please Wait while comments are loading...