ఆస్కార్‌ విజేతకి తెలుగు పచ్చళ్లంటే చాలా ఇష్టం: లక్ష్మీ మంచుతో ఇలా

హైదరాబాద్‌: ఉత్తమ కథానాయికగా ఆస్కార్‌ పురస్కారం అందుకున్న హాలీవుడ్‌ నటి బ్రీ లార్సన్‌.. తెలుగు నటి లక్ష్మీ మంచు మంచి స్నేహితులు. తన మిత్రురాలికి ఆస్కార్ పురస్కారం రావడం పట్ల ఆనందం వ్యక్తం లక్ష్మీ.. ఈ సందర్భంగా బ్రీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

బ్రీ లార్సన్‌కి తెలుగింట తయారుచేసే పచ్చళ్లంటే ఇష్టమని మంచు లక్ష్మి చెప్పారు. తాను లాస్‌ఏంజెల్స్‌లో ఉన్నప్పుడు బ్రీ లార్సన్‌తో స్నేహం ఏర్పడిందని, ఆమె ఆస్కార్‌ గెలుచుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. లార్సన్‌కు తెలుగు పచ్చళ్లంటే ఇష్టమని, ఇద్దరూ కలిసినప్పుడు ఆహారం గురించే మాట్లాడుకునే వారిమని తెలిపారు.

Brie loves our Telugu pachadi: Lakshmi Manchu

నిరుడు జరిగిన తన సోదరుడు మంచు మనోజ్‌ వివాహానికి బ్రీ లార్సన్‌ హాజరయ్యారని, వెళ్లేటప్పుడు కొన్నిరకాల పచ్చళ్లను ప్యాక్‌ చేయించుకుని తీసుకెళ్లారని చెప్పారు. ప్రత్యేకించి గోంగూర, చింతకాయ పచ్చడి అంటే బ్రీకి చాలా ఇష్టమని వివరించారు.

Brie loves our Telugu pachadi: Lakshmi Manchu

కాగా, ప్రస్తుతం మంచు లక్ష్మీ, బ్రీ లార్సన్‌లు కలిసి ‘బాస్మతీ బ్లూస్‌' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెట్‌లో బ్రీతో దిగిన ఫొటోలను మంచు లక్ష్మి సోషల్‌మీడియా ఫేస్‌బుక్ ద్వారా పంచుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+