బ్రోతల్ హౌస్‌పై దాడి, పట్టుబడ్డ ఇద్దరు ముంబై మోడల్స్
హైదరాబాద్: హైదరాబాదులో పోలీసులు ఓ బ్రోతల్ హౌస్ పైన దాడులు నిర్వహించారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో గల ఓ అపార్టుమెంటులో బ్రోతల్ హౌస్ నడుస్తుందని పోలీసులకు శనివారం రాత్రి సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
బ్రోతల్ హౌస్ పైన దాడి చేశారు. ఈ దాడి ద్వారా ఇద్దరు యువతులకు వ్యభిచారం నుండి విముక్తి కలిగించారు. ఈ యువతులు ఇద్దరు కూడా ఇరవయ్యేళ్ల వయస్సులోని వారు. వారు ముంబైకి చెందిన మోడల్స్‌గా తెలుస్తోంది.

పోలీసులు ముగ్గురు కస్టమర్లను అక్కడ అరెస్టు చేశారు. నిర్వాహకులు తప్పించుకున్నారు. బ్రోతల్ హౌస్ పైన దాడి చేసిన సమయంలో పోలీసులు కస్టమర్లను, బాధిత యువతులను ఓ గదిలో గుర్తించారు. పోలీసులు ముగ్గురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఈ బ్రోతల్ హౌస్ గత నెల రోజులుగా ఈ రెసిడెన్షియల్ ఏరియాలో నడుస్తున్నట్లుగా చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ముంబై మోడల్స్‌గా చెబుతున్న బాధిత యువతులను పోలీసులు రెస్క్యూ హోంకు తరలించారు. బ్రోతల్ హౌస్ నిర్వాహకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications