బ్రోతల్ హౌస్‌పై దాడి, ఇద్దరు యువతుల పట్టివేత
హైదరాబాద్: హైదరాబాదులో పోలీసులు బ్రోతల్ హౌస్ పైన దాడులు నిర్వహించి, ఇద్దరు యువతులను వ్యభిచారకూపం నుండి కాపాడారు. శ్రీనగర్ కాలనీలోని ఓ అపార్టుమెంటులోని ఇంటి పైన పోలీసులు ఆదివారం దాడి చేసి వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు.
ఇందుకు సంబంధించి పోలీసులు బ్రోతల్ హౌస్ నడుపుతున్న అరవై అయిదేళ్ల మహిళను అరెస్టు చేశారు. ఆమె కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

కడప జిల్లాకు చెందిన సదరు మహిళ ఆర్థిక ఇబ్బందులతో నెల రోజుల క్రితం హైదరాబాదుకు వచ్చింది. ఇక్కడ బ్రోతల్ హౌస్‌ను నడిపి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది. తాను కిరాయికి తీసుకున్న ఇంటిలోనే దీనిని నడపుతోంది.
ఈమె వివిధ ప్రాంతాల నుండి సెక్స్ వర్కర్లను తీసుకు వస్తోంది. అమెను అరెస్టు చేసిన పోలీసులు ఆమె వదద్ నుండి రూ.6,000, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువతులను పోలీసులు వ్యభిచార కూపం నుండి రక్షించారు.












Click it and Unblock the Notifications