బావమరిది భార్యపై బావ ఘాతుకం, లైంగికదాడి, వివస్త్రను చేసి.. ఫొటోలు తీసి బెదిరింపు

ఇది కలికాలమే.. వావి వరసలు లేనే లేవు. కొందరు మృగాళ్లు కామంతో రెచ్చిపోతున్నారు. వరస మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మృగాడు తనకు సోదరి అయ్యే వివాహితపై లైంగికదాడికి పాల్పడ్డాడు. తర్వాత వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించడంతో.. ఆమె కుమిలిపోయింది. గతనెల 31వ తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రాక్షసుడు..

రాక్షసుడు..

పశ్చిమగోదావరి జిల్లా అరికిరేవుల గ్రామంలో జంట నివసిస్తోంది. అయితే అతని సోదరి దంపతులు ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం ఉంటారు. సోదరి భర్త చిటీలు నిర్వహిస్తూ.. ప్రతీ శుక్రవారం అరికిరేవుల వస్తుంటాడు. అలానే జనవరి 31వ తేదీన వచ్చాడు. కానీ తన వరసనే మరచిపోయి.. ప్రవర్తించాడు.

సమయం చూసి..

సమయం చూసి..

బావమరిది ఇంటికొచ్చిన వ్యక్తి.. తనకు వరసకు చెల్లె అయ్యే వివాహితపై లైంగికదాడి చేశాడు. ఆ సమయంలో భర్త ఇంట్లో లేరు. చుట్టుపక్కల వారు కూడా లేకపోవడంతో రెచ్చిపోయాడు. దిక్కుతోచని స్థితిలో వివాహిత అరిచి, గీపెట్టిన వదల్లేదు. లైంగికదాడి తర్వాత వివాహితను వివస్త్రను చేసి ఫోటోలు కూడా తీశాడు. దీంతో ఆమె మరింత భయపడి పోయింది.

బెదిరింపు

బెదిరింపు

విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. చెబితే ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని భయపెట్టాడు. దీంతో వివాహిత మరింత భయపడిపోయింది. ఎవరికీ చెప్పకుంటే రూ.5 వేలు ఇస్తానని కూడా చెప్పాడు. అప్పటినుంచి వివాహిత కుమిలిపోయింది. కానీ చివరికి భర్త, అత్త మామలకు విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తమ బావపై కఠిన చర్యలు తీసుకోవాలని బావమరిది పోలీసులను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+