APలో అలా అయితేనే మనం సక్సెస్ అవుతాం: BRS

బహిరంగ సభ ఎక్కడ జరిగితే విజయవంతమవుతుందో అక్కడే నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.

భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఆయన పార్టీలో చేరే సమయంలో, పదవిని స్వీకరించే సమయంలో కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి తర్వాత పార్టీలో చేరేందుకు ఏపీలో నేతలు క్యూ కడతారన్నారు. సంక్రాంతి అయిపోయి రెండువారాలవుతోంది. కానీ ఇంతవరకు ఏపీ నుంచి ఆ పార్టీలోకి చేరడానికి ముందుకు రావడంలేదు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికా?

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికా?

తోటను అధ్యక్షుడిగా నియమించడంవల్ల కాపు సామాజికవర్గం నుంచి వస్తారా? కాంగ్రెస్ నేతలు వస్తారా? కేసీఆర్ తో సన్నిహితంగా ఉండే ఏపీ నేతలెవరైనా వస్తారా? లేదంటే.. టీడీపీ, వైసీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరికలుంటాయా? అనే చర్చ రాష్ట్రంలో జోరుగా సాగింది. ప్రజల్లో గట్టి పట్టున్న నేతలెవరూ పార్టీలో చేరలేదు. ఈ తరహా నాయకులు చేరితేనే రాష్ట్రంలో బీఆర్ఎస్ బలోపేతమవుతుంది. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విపక్షాలు విమర్శలు ప్రారంభించాయి.

విశాఖపట్నంలో అయితే సభ విజయవంతం?

విశాఖపట్నంలో అయితే సభ విజయవంతం?

విజయవాడ నగరానికి సమీపంలో రాష్ట్ర కార్యాలయం ఏర్పాటవుతుందని ముందుగానే స్థలాన్ని కూడా పరిశీలించారు. దీని బాధ్యతలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అప్పజెప్పారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విశాఖపట్నంలో బీఆర్ఎస్ సభ పెట్టాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.

కేసీఆర్ సామాజికవర్గానికి చెందినవారు ఉత్తరాంధ్రలో ఎక్కువమంది ఉండటంతో అక్కడైతేనే సభ విజయవంతమవుతుందని భావిస్తున్నారు. అయితే ముందుగా నాందేడ్ లో, తర్వాత హైదరాబాద్ లో సభలున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత విశాఖపట్నంలో ఉంటుందని, దాదాపు మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఈ సభ ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

చేరేవారి వివరాలు గోప్యంగా..

చేరేవారి వివరాలు గోప్యంగా..

ఏపీకి చెందిన నేతలు పలువురు ఇప్పటికే భారత రాష్ట్ర సమితిలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారని, కానీ వారి వివరాలు గోప్యంగా ఉంచుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి, జాతీయ పార్టీ హోదా సాధించడానికి అవసరమైన ఆరుశాతం ఓటింగ్ ను సాధించడంలో ఏపీ కీలకంగా మారుతుందనేది కేసీఆర్ అంచనా. ఆ అంచనాలకు తగ్గట్లుగా ఇక్కడి నేతలు పనితీరు కనపరిస్తే లక్ష్యం సులువుగా చేరుకోవచ్చని లేదంటే కష్టమనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+