'ప్రేమ'అని వంచించి.. శృంగార వీడియోను నెట్‌లో పెట్టిన బీటెక్ బాబు..

నగరంలో ఓ కోర్సులో చేరిన అతనికి అక్కడే ఓ యువతితో పరిచయమైంది. అది కాస్త ప్రేమకు దారితీసి ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యానికి దారితీసింది.

చిత్తూరు: ప్రేమ పేరుతో యువతిని మోసగించడమే గాక.. ఆమెను లోబరుచుకుని ఆపై ఆ వీడియోలను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశాడు ఓ ప్రబుద్దుడు. తొలుత డబ్బుల కోసం డిమాండ్ చేసి.. యువతి అందుకు నిరాకరించడంతో ఆమెతో శృంగారంలో పాల్గొన్న వీడియోలను ఇంటర్నెట్ లో పెట్టాడు.

చిత్తూరు జిల్లా సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న నవీన్ ప్రసాద్ అనే యువకుడు ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. స్నేహితుల ద్వారా వీడియోల విషయం తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగుచూసింది.

Btech student held for leaked his girlfriend video

వివరాల్లోకి వెళ్తే.. బీటెక్ లో చేరడానికి ముందు నవీన్ ప్రసాద్ రెండేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. నగరంలో ఓ కోర్సులో చేరిన అతనికి అక్కడే ఓ యువతితో పరిచయమైంది. అది కాస్త ప్రేమకు దారితీసి ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యానికి దారితీసింది. దీంతో ఇద్దరు శృంగారంలో పాల్గొన్నారు.

అయితే శృంగారం చేస్తున్న సమయంలో నవీన్ ప్రసాద్ ఆ వీడియోలను తన సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించాడు. కొద్ది రోజులకు తిరిగి చిత్తూరు వెళ్లిపోయిన అతను యువతికి ఫోన్ చేసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు ఇంటర్నెట్ లో పెడుతానని బెదిరించాడు.

డబ్బులిచ్చేందుకు యువతి ససేమిరా అనడంతో అన్నంత పనిచేశాడు. వీడియోలను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేయడంతో స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. మంగళవారం నాడు చిత్తూరులో నవీన్ ప్రసాద్ ను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు అతన్ని హైదరాబాద్ కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+