ఏలూరులో బీటెక్ విద్యార్ధిని అదృశ్యం, వివాహిత అనుమానాస్పద మృతి
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని రామచంద్రా ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ నాల్గవ సంవత్సరం చదువుతున్న ప్రీతి అనే విద్యార్ధిని అదృశ్యమైంది. ఏలూరు త్రీ టౌన్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం సోమవారం కాలేజీకి వెళ్లిన విద్యార్ధిని ఇంటికి తిరిగి రాలేదు.
దీంతో కంగారు పడ్డ విద్యార్ధిని తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లి విచారించారు. సాయంత్రం 5 గంటలకే ప్రీతి వెళ్లిపోయిందని అక్కడివారు చెప్పారు. ఆ తర్వాత ప్రీతి తల్లిదండ్రులు తెలిసిన వారందరినీ విచారించారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు.
పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్ధిని ప్రీతిది తూర్పుగోదావరి జిల్లా పెద్దపాడు మండలం తాళ్లమూడి గ్రామం.

వివాహిత అనుమానాస్పద మృతి
విజయనగరంలోని దాసన్నపేట కొత్తవాడలో మంగళవారం ఉదయం ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు కథనం ప్రకారం స్థానికంగా నివసిస్తున్న స్వాతికి ఏడాది క్రితం వివాహమైంది. మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని విగతజీవిగా కనిపించింది.
భర్తే స్వాతిని చంపి ఉరేసి ఆత్మహత్యగా ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications