యువతిని కిడ్నాప్ చేయబోయిన లోకేష్!: బైక్ దూకేయడంతో పరార్..
బస్ స్టాప్ లో నిలుచుకున్న జూనియర్ విద్యార్థిని బెదిరించి.. బలవంతంగా బైక్ పై ఎక్కించుకున్నాడు. ఆపై నారాకోడూరు సెంటర్ మీదుగా యువతిని ఎటో తీసుకెళ్లబోయాడు. ప్రమాదాన్ని పసిగట్టిన యువతి.. నారాకోడూరు సెంటర్
హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో జూనియర్లను సీనియర్లు వేధించిన ఘటనలు ఇదివరకు అనేకం వెలుగులోకి వచ్చాయి. సీనియర్స్ వేధింపులకు తాళలేక జూనియర్స్ ఆత్మహత్యలకు పాల్పడ్డ ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలోను ఓ సీనియర్ బీటెక్ విద్యార్థి.. జూనియర్ బీటెక్ విద్యార్థినిపై దౌర్జన్యానికి దిగాడు.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరులోని సంగడిగుంట రెడ్లబజారుకు చెందిన ఓ విద్యార్థిని చేబ్రోలులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. రోజూ లాగే కాలేజీకి వెళ్లేందుకు బస్ స్టాప్ వద్ద వేచియున్న సమయంలో.. అదే కాలేజీకి చెందిన లోకేష్ అనే సీనియర్ విద్యార్థి బైక్ పై అక్కడికి వచ్చాడు.

బస్ స్టాప్ లో నిలుచుకున్న జూనియర్ విద్యార్థిని బెదిరించి.. బలవంతంగా బైక్ పై ఎక్కించుకున్నాడు. ఆపై నారాకోడూరు సెంటర్ మీదుగా యువతిని ఎటో తీసుకెళ్లబోయాడు. ప్రమాదాన్ని పసిగట్టిన యువతి.. నారాకోడూరు సెంటర్ వద్ద బైక్ పైనుంచి దూకేసింది. యువతి బైక్ పైనుంచి దూకడంతో స్థానికులంతా అక్కడ గుమిగూడారు. దీంతో లోకేష్ అక్కడినుంచి పరారయ్యాడు.
ఆపై బాధిత యువతి తల్లిదండ్రులు లోకేష్ గ్రామమైన పెదనందిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు గురించి తెలుసుకున్న లోకేష్ తరుపువారు.. యువతి తల్లిదండ్రులను బెదిరించారు. లోకేష్ పై కేసు నమోదవడంతో.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications