జనసేన ఆశలపై "బకెట్" నీళ్లు - పోలింగ్ లెక్కలతో కొత్త టెన్షన్..!!
ఏపీలో పోలింగ్ వేళ చోటు చేసుకున్న అనూహ్య అంశాలు బయటకు వస్తున్నాయి. గెలుపు పైన భారీ ఆశలు పెట్టుకున్న అభ్యర్దుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. జనసేన ఎన్నికల ముందే సింబల్ విషయంలో ఆందోళన చెందింది. పోలింగ్ సరళి విశ్లేషణ సమయంలో ఆ పార్టీ నేతలు ఆందోళన నిజం అయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో పోటీ చేసిన కొందరు జనసేన అభ్యర్దల్లో ఈ ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో..ఫలితాల పైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది.
గుర్తులతో చిక్కులు
జనసేన ఏపీలో 2 ఎంపీ, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. తొలుత జనసేన సింబల్ గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ప్రకటించారు. ఆ తరువాత జనసేన న్యాయ పోరాటం చేసింది. ఫలితంగా జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లోని పార్లమెంట్ పరిధిలో మరెవరికీ గాజు గ్లాసు గుర్తు ఇవ్వమని ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది. కానీ, బకెట్ గుర్తు పైన జనసేన నేతల్లో అప్పట్లోనే ఆందోళన కనిపించింది. తెలంగాణలో బీఆర్ఎస్ గుర్తు కారుతో పోలిన పడవ గుర్తు ఆ పార్టీకి ఎన్నికల్లో రావాల్సిన ఓట్లను గండి కొట్టింది. ఫలితాలనే తారు మారు చేసింది.

గోదావరిలో కొత్త టెన్షన్
దీంతో..ఎన్నికల ముందే జనసేన నేతలు తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో బకెట్ గుర్తు లేకుండా చూడాలని కోరారు. అయితే, పలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్దులు బకెట్ గుర్తుతో పోటీలో నిలిచారు. ప్రధానంగా తూర్పు గోదావరిలో ఒక కీలక నియోజకవర్గంలో ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తంగా ఫలితాన్నే నిర్దేశించే విధంగా మారింది. వైసీపీ - జనసేన మధ్య హోరా హోరీగా మారిన ఈ ఎన్నికల పోరులో ఇరు పార్టీల అభ్యర్దులు గెలుపు పైన ధీమాతో ఉన్నారు. అయితే, జనసేన ఈ నియోజకవర్గం నుంచి గెలుపు పైన భారీ అంచనాలతో కనిపించింది.

ఫలితం మార్చేసేలా
పోలింగ్ పూర్తయిన తరువాత నియోజకవర్గ వ్యాప్తంగా సేకరించిన పోలింగ్ కేంద్రాల సమాచారం..ఓటింగ్ సరళి...పోలైన ఓట్లను పరిశీలించిన తరువాత ఆసక్తి కర అంశాలు గుర్తించారు. గాజు గ్లాసుకు వేయాల్సిన ఓట్లు బకెట్ కు పోలైనట్లు క్షేత్ర స్థాయి సమాచారంలో జనసేన నేతలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఓటింగ్ సరళి పైన సమీక్షలో పార్టీ నేతలు ఏకరువు పెట్టారు. తాము మెజార్టీ సాధిస్తామని చెబుతున్న ఓట్ల స్థాయిలోనే బకెట్ గుర్తుకు ఓట్లు పోలయినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో..తాము అంచనా వేస్తున్న మెజార్టీ కంటే తక్కువ ఉంటే పర్వాలేదని..లేకుంటే తమకు నష్టం తప్పదని జనసేన నేతలు పార్టీ ముఖ్యుల వద్ద వాపోయినట్లు సమాచారం. దీంతో..ఆ నియోజకవర్గంలో ఇప్పుడు కౌంటింగ్ మరింత ఉత్కంఠ పెంచుతోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications