పెరిగిన బుడమేరు వరద - డేంజర్ బెల్స్..!!
బుడమేరుకు వరద తాకిడి పెరుగుతోంది. విజయవాడను ముంచెత్తిన బుడమేరులో వదర పెరుగుతోందనే వార్తలు ఆందోళన పెంచుతున్నాయి. బుడమేరుకు గండ్లను గుర్తించిన ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో పని చేస్తుంది. ఇప్పటికే ఒక గండిని పూడ్చారు. మరో రెండు గండ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బుడమేరు పరిధిలో ఏడు సెంటీ మీటర్ల వర్షం కురిసింది. 5,689 ఓౌట్ ఫ్లో గా ఉంది. దీంతో, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
బెజవాడను ముంచెత్తిన వరదలు కాస్త తగ్గుముఖం పడుతుండగానే గురువారం మరోసారి వర్షం కురిసింది. దీంతో బుడమేరుకు వరద తాకిడి పెరుగుతోంది. బుడమేరు వాగుకు పడిన గండ్లను పూడ్చేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఈ పనులకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్పారు. మంత్రి రామానాయుడు బుడమేరు గండ్లు పూడ్చేందుకు రాత్రంతా అక్కడే మకాం వేసారు.

ఒక్కో గండి దాదాపు 50మీటర్ల పైనే ఉండటం, వరద ఉదృతంగా ఉండటంతో గండ్లు పూడ్చే పనులు ప్రభుత్వానికి పెను సవాల్ గా మారింది. ఎట్టకేలకు బుడమేరుకు పడిన మొదటి గండిని అధికారులు పూడ్పించారు. బుడమేరు నీటి ఉధృతిపై అధికారులతో కలెక్టర్ బాలాజీ సమీక్షించారు. బస్సులు, పడవలు ద్వారా ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని కలెక్టర్ బాలాజీ కోరారు. ఇటు ఇరిగేషన్ అధికారులు నీటి ప్రవాహాన్ని నిరంతరం అంచనా వేస్తున్నారు. అవసరమైన సూచనలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications