నేను లక్షల వ్యాపారం చేస్తుంటే.. కొడాలి నాని ఆయిల్ దొంగతనాలు చేసేవాడు: బుద్ధా వెంకన్న ఫైర్

అమరావతి: గుడివాడ క్యాసినో వ్యవహారంపై రాజకీయ దుమారం ఏమాత్రం తగ్డడం లేదు. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. అనుచిత వ్యాఖ్యలు చేసి నిన్న అరెస్టై బెయిల్‌పై విడుదలైన టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న మరోసారి అధికార పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు.

ఆయిల్ దొంగ అంటూ కొడాలి నానిపై బుద్ధా వెంకన్న విమర్శలు

ఆయిల్ దొంగ అంటూ కొడాలి నానిపై బుద్ధా వెంకన్న విమర్శలు


బుద్ధా వెంకన్న మాట్లాడుతూ... 1991లో నెలకు రూ.1.15 లక్షల అద్దె కట్టి తాను కొబ్బరికాయల వ్యాపారం చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో కొడాలి నాని ఆగి ఉన్న వాహనాల్లో ఆయిల్ దొంగతనం చేసేవాడని అన్నారు. కొడాలి నాని వద్ద పాన్‌ పరాగ్ డబ్బా కొనుక్కునే డబ్బులు కూడా లేవు. అలాంటి కొడాలి నానికి ఇంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. పెద్ద కన్వెన్షన్ సెంటర్ కొడాలి నాని ఎలా కట్టగలిగారు..? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి, కొడాలి నానికి ఒకేసారి కరోనా వస్తే... ఉండవల్లిలోని తన నివాసంలోనే చంద్రబాబు హోం ఐసొలేషన్‌లో ఉండి కోలుకున్నారని చెప్పారు. ఇక, కరోనా సోకగానే చికిత్స కోసం పక్క రాష్ట్రంలో ఆస్పత్రికి పారిపోయిన కొడాలి నాని చంద్రబాబు ఆరోగ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

కొడాలి నానిపై కేసు పెట్టరా? ఆయనే జీతాలిస్తున్నారా?: పోలీసులపై బుద్ధా

కొడాలి నానిపై కేసు పెట్టరా? ఆయనే జీతాలిస్తున్నారా?: పోలీసులపై బుద్ధా


డబ్బు పిచ్చి, పదవి పిచ్చి పట్టిన కొడాలి నాని.. సీఎం వైఎస్ జగన్ దగ్గర మార్కుల కోసం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కొడాలి నాని భాష గురించి ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారన్నారు. అలాంటి కొడాలి నానికి అతని భాషలోనే సమాధానం చెప్పాలన్నారు. కొడాలి నాని పిచ్చి కుదర్చటానికే తాను ఇలా మాట్లాడుతున్నట్లు చెప్పారు. మంత్రి కొడాలి నాని వాడిన భాషపై అభ్యంతరం తెలుపుతూ విజయవాడ వన్ టౌన్‌లో కేసు పెట్టినా ఇంతవరకు అక్నాల్డెజ్‌మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. తనపై కేసు పెట్టి విచారించినట్లే.. మంత్రి కొడాలి నానిపై కేసు పెట్టి విచారించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ప్రజల దగ్గర జీతాలు తీసుకుంటున్నారా..? కొడాలి నాని దగ్గర జీతాలు తీసుకుంటున్నారా..? అని ప్రశ్నించారు బుద్ధా వెంకన్న.

గుడివాడ ఏమైనా పాకిస్థానా? కొడాలికి తన భాషలోనే?: బుద్ధా వెంకన్న సవాల్

గుడివాడ ఏమైనా పాకిస్థానా? కొడాలికి తన భాషలోనే?: బుద్ధా వెంకన్న సవాల్

ఇతర పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకోవటానికి గుడివాడ ఏమైనా పాకిస్తానా? అని ప్రశ్నించారు బుద్ధా వెంకన్న. మొన్న టీడీపీ వాళ్లు వెళ్తే ఆపారు.. ఇప్పుడు బీజేపీని అడ్డుకుంటున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు గురించి కొడాలి మాట్లాడితే.. నేనూ అదే స్థాయిలో మాట్లాడతా. కొడాలి నానిని పార్టీ నుంచి పంపిస్తే మీ పార్టీకున్న దరిద్రం పోతుందని వైసీపీకి చురకలు అంటించారు. మంత్రి కొడాలి నాని వెంటనే డిస్మిస్‌ చేయాలని బుద్ధా వెంకన్న డిమాండ్‌ చేశారు. గుడివాడ క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలి నాని, డీజీపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు ఆయనను సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి వరకు విచారించారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో బుద్ధా వెంకన్నను పోలీసులు విడుదల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+