పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు టీడీపీ ఎంపీ డుమ్మా: కారణం?: స్పీకర్‌కు లేఖ

శ్రీకాకుళం: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ సభ్యుడొకరు గైర్హాజర్ కానున్నారు. తొమ్మిది రోజుల పాటు ఆయన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనట్లేదు. దీనికి కారణం- పితృత్వ సెలవులు. తనకు పితృత్వ సెలవులు కావలంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాకుళం లోక్‌సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి కిందట లేఖ రాశారు. తన భార్య ప్రసవ సమయం సమీపించిందని, తాను తండ్రిని కాబోతోన్నానని తెలిపారు.

ఈ కారణంతో ఈ శుక్రవారం నుంచి వచ్చేనెల 10వ తేదీ వరకు తాను బడ్జెట్ సమావేశాలకు హాజరు కాలేనని తెలిపారు. తొమ్మిది రోజుల పాటు తనకు సెలవు కావాలని విజ్ఞప్తి చేశారు. వచ్చేనెల 11వ తేదీ నుంచి మళ్లీ తాను బడ్జెట్ సమావేశాలకు హాజరవుతానని పేర్కొన్నారు. తన భార్య ప్రసవానికి ముందు.. ఆ తరువాత.. ఆమె బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత ఓ భర్తగా.. కాబోయే తండ్రిగా తన మీద ఉందని గుర్తు చేశారు. ఈ తొమ్మిది రోజుల పాటు తన గైర్హాజరీని పితృత్వ సెలవుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.

Budget 2021: TDP MP K Ram Mohan Naidu writes a letter to Speaker Om Birla for Paternity leave

రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం పార్టీకే చెందిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి చిన్న కుమార్తె శ్రావ్యను వివాహంన చేసుకున్న విషయం తెలిసిందే. 2017లో వారి వివాహమైంది. రామ్మోహన్ నాయుడు తండ్రి, దివంగత ఎర్రన్నాయుడితో బండారు సత్యనారాయణ మూర్తికి స్నేహితులు. ఆ రెండు కుటుంబాల మధ్య సాన్నహిత్యం ఉంది. తండ్రి ఎర్రన్నాయుడి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లో రాణిస్తున్నారు. తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన పోటీ చేసిన రెండుసార్లూ శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించారు. ఇక ఆయన తండ్రి కాబోతోన్నారు.

Budget 2021: TDP MP K Ram Mohan Naidu writes a letter to Speaker Om Birla for Paternity leave

లోక్‌సభ సభ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే సభ్యుడిగా రామ్మోహన్ నాయుడికి గుర్తింపు ఉంది. నియోజకవర్గం ప్రజల తరఫున అనేక అంశాలపై ఆయన సభలో ప్రస్తావించిన తీరు.. రామ్మోహన్ నాయుడికి ప్రత్యేకతను తెచ్చిపెట్టంది. చిన్న వయస్సులోనే సంసద్ రత్న పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. పార్లమెంట్‌ సభ్యుడిగా కనబరిచిన అత్యుత్తమ పనితీరును ప్రదర్శించిన సభ్యులకు లభించే పురస్కారం ఇది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+