ఒక్కో ఎమ్మెల్యేకు రెండు కోట్ల నిధులు-పార్టీలకతీతంగా: రాజధాని ప్రస్తావన లేకుండానే..!!
ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్ లో ఎమ్మెల్యేలకు వరం ప్రకటించారు. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితులు..కరోనా కారణంగా రాష్ట్రంలో డెవలప్ మెంట్ కోసం నిధులను ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యేకంగా మంజూరు చేయలేదు. అయితే, 2024 ఎన్నికల దిశగా కసరత్తు ప్రారంభిస్తున్న సీఎం జగన్ ముందుగా పార్టీ ఎమ్మెల్యేలను సంసిద్దులను చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా.. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా డెవలప్ మెంట్ పనుల కోసం నిధులు మంజారు చేయాలని కోరుతూ వస్తున్నారు.
Recommended Video

నియోజకవర్గాలకు నిధులు
దీంతో.. శాసనసభలోని ఎమ్మెల్యేలందరికీ పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరి నియోజక వర్గానికి రెండు కోట్ల చొప్పున కేటాయించారు. ఎమ్మెల్యేలు గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం ఈ నిధులు మంజూరు చేస్తారు. దీనిని మంత్రి బుగ్గన తన బడ్జెట్ ప్రసంగంలో స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీ ఫండ్ గా దీనిని ఖరారు చేసారు. ఇందు కోసం తాజా బడ్జెట్ లో రూ 350 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లుగా మంత్రి ప్రకటించారు. ఇక, అమరావతిని ఆరు నెలల కాలంలో పూర్తి చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దీని కోసం అమరావతికి నిధుల కేటాయింపు పైన అందరూ ఆసక్తిగా చూసారు. కానీ, బడ్జెట్ లో ఎక్కడా ప్రత్యేకంగా అమరావతి ప్రస్తావన లేదు.

మూడు రాజధానుల ప్రస్తావన లేకుండానే
అదే విధంగా మూడు రాజధానుల గురించి మంత్రి బుగ్గన తన ప్రసంగంలో ప్రస్తావనకు తీసుకురాలేదు. మౌళిక సదుపాయాల కల్పనలోనూ అమరావతి గురించి చెప్పలేదు. అర్బన్ డెవలప్ మెంట్ కోసం ప్రభుత్వం ఈ బడ్జెట్ లో రూ 8,796.33 కోట్లను కేటాయించింది. అయితే, అందులో అనుబంధ పద్దుల్లో అమరావతి లేదా మూడు రాజధానుల కోసం ఏమైనా కేటాయింపులు ఉన్నాయా అనేది స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాల విభజన ద్వారా ప్రభుత్వం సుపరిపాలన దిశగా మరో అడుగు ముందుకేస్తోందని మంత్రి బుగ్గన తన ప్రసంగంలో స్పష్టత ఇచ్చారు. సుస్థిరమైన పాలన అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. సమ్మిళిత - సుస్థిర పాలన దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నామని బుగ్గన చెప్పుకొచ్చారు.

ప్రాధాన్యతా రంగాలకు కేటాయింపులు
ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్ కు రూ. 11, 482.37 కోట్లు కేటాయించిన ప్రభుత్వం వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టు పూర్తి దిశగా చర్యలు తీసుకుంటామని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేసారు. ఇక, పెరిగిన పీఆర్సీ వేతనాలు..ప్రభుత్వ నిర్వహణ కోసం ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఫైనాన్స్ కింద రూ. 58,583.61 కోట్లు కేటాయించింది. అదే విధంగా సాధారణ పరిపాలనా వ్యవహారాల కోసం ఈ బడ్జెట్ లో జీఏడీ కి రూ. 998.55 కోట్లు ప్రతిపాదించారు. పరిశ్రమల శాఖ రూ. 2,755 కోట్లు కేటాయింపుల గురించి ప్రస్తావిస్తూ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గురించి బుగ్గన ప్రస్తావన చేసారు. అదే విధంగా ఏపీలో హోంశాఖ 7,586 కోట్లను ఈ బడ్జెట్ లో ఆర్దిక మంత్ిర బుగ్గన ప్రతిపాదించారు.
-
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
ఏపీ రాజధానిని మళ్లీ మార్చుకోవచ్చా ? అమరావతి గెజిట్ కూడా సరిపోదా ? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications