కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆగండి! పార్టీ మారడంపై అన్నీ చెబుతా: బుట్టా రేణుక ఆసక్తికర వ్యాఖ్యలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక ఈ రోజు (మంగళవారం) తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

పార్టీ మారడంపై అన్నీ చెబుతా: బుట్టా రేణుక ఆసక్తికర వ్యాఖ్యలు | Oneindia Telugu

కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక ఈ రోజు (మంగళవారం) తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.

ఏం చేయలేను, ఇదీ నా పరిస్థితి: జగన్‌కు అలా చెప్పి తప్పించుకున్న రేణుక!ఏం చేయలేను, ఇదీ నా పరిస్థితి: జగన్‌కు అలా చెప్పి తప్పించుకున్న రేణుక!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు. ఉదయం పది గంటలకు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆమె అధికార పార్టీలో చేరనున్నారు.

చదవండి: అంతా కలెక్టర్, అధికారుల వల్లే: కేటీఆర్ ఆగ్రహంపై తలపట్టుకున్నారు, మంత్రి వస్తే ఆమ్రపాలి ఇలా..

 బుట్టా రేణుకతో పాటు వీరు కూడా

బుట్టా రేణుకతో పాటు వీరు కూడా

టిడిపిలో చేరేందుకు బుట్టా రేణుక విజయవాడకు చేరుకున్నారు. అనంతరం ఉదయం కృష్ణానది కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసానికి బయలుదేరారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే, వైసిపి నేత కొత్తకోట ప్రకాశ్ రెడ్డి తదితరులు టిడిపిలో చేరుతున్నారు.

 టిడిపిలోకి ఆహ్వానించనున్న చంద్రబాబు

టిడిపిలోకి ఆహ్వానించనున్న చంద్రబాబు

ఉదయం పది గంటలకు టిడిపి అధినేత చంద్రబాబు.. బుట్టా రేణుకను పార్టీలోకి ఆహ్వానించి, పార్టీ కండువ కప్పనున్నారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత బుట్టా రేణుక మాట్లాడనున్నారు.

 పార్టీ మారడానికి కారణాలు చెబుతా

పార్టీ మారడానికి కారణాలు చెబుతా

కాగా, విజయవాడలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో బుట్టా రేణుక మాట్లాడారు. చంద్రబాబును కలిసిన తర్వాత, తాను పార్టీ మారడానికి గల కారణాలను వెల్లడిస్తానని చెప్పారు. కొంచెం ఆగితే, అన్ని విషయాలు చెబుతానని అభిప్రాయపడ్డారు. దీంతో జగన్ గురించి ఏం చెబుతారనే ఆసక్తి నెలకొంది.

 వాళ్లు నిర్ధారించలేదు

వాళ్లు నిర్ధారించలేదు

మరోవైపు, అనంతపురం జిల్లాకు చెందిన వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి కూడా టిడిపిలో చేరతారన్న ప్రచారం ఉన్నప్పటికీ స్పష్టత రాలేదు. కర్నూలు జిల్లాకు చెందిన ఒకరిద్దరు వైసిపి ఎమ్మెల్యేలు ఎంపీ రేణుకతోపాటు టిడిపిలోకి వస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ ఆ ఎమ్మెల్యేలు నిర్ధరించలేదు.

English summary
In a setback to the YSR Congress party, Kurnool MP Butta Renuka has decided to call it a day in the Opposition party and is joining the Telugu Desam Party in the presence of Chief Minister N. Chandrababu Naidu in Vijayawada on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X