కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ది సోనియా స్టాండ్, మోడీ కోసం బాబు: బైరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

byreddy rajasekhar reddy
కర్నూలు/ హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీది సమైక్యవాద వైఖరి కాదని, సోనియా వైఖరి అని రాయలసీమ ఉద్యమ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఒప్పందం మేరకే వైయస్ జగన్‌కు బెయిల్ లభించిందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి నేత నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకునే పనిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని సోనియా గాంధీ పగటి కలలు కంటున్నారని బైరెడ్డి అన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ లభించడంతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఎన్. తులసిరెడ్డి అన్నారు. సిబిఐని కాంగ్రెస్ ప్రభావితం చేసి ఉంటే ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకట రమణ, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి పేర్లు చార్జిషీట్లలో వచ్చేవి కాదని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం, బిజెపిలు తమ పార్టీపై విమర్శలు చేస్తున్నాయని తులసిరెడ్డి బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో దుయ్యబట్టారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీది బూటకపు సమైక్యవాదమని తెలుగుదేశం పార్టీ నాయకుడు లింగారెడ్డి విమర్శించారు కాంగ్రెసు పార్టీ తనను తాను చంపుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని బలోపేతం చేస్తోందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సోనియా కాళ్ల వద్ద తాకట్టు పెట్టిందని ఆయన విమర్సించారు.

English summary
Rayalaseema leader Byreddy Rajashekhar Reddy rejected YS Jagan's YSR Congress united Andhra stand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X