పవన్ పోరు వెనుక తొక్కేసే కుట్ర, ఇదేం సినిమా కాదు, చిరుని చూసి నేర్చుకోలేదా: బైరెడ్డి
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మద్దతుతోనే మంచి ప్రభుత్వాలు ఏర్పడ్డాయని బీజేపీ నేత, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస రావు సోమవారం అన్నారు. పవన్ తనకు మంచి మిత్రుడు అన్నారు. ప్రత్యేక హోదా పైన కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

పవన్‌ను చంద్రబాబు ఆడిస్తున్నారు: బైరెడ్డి
ఉద్యమాలు అంటే టిక్కెట్ కొని మూడు గంటలు ఎంజాయ్ చేసే సినిమాలు కాదనే విషయం చిరంజీవి నుంచి అయినా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేర్చుకోకుంటే ఎలాగని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కడప జిల్లాలో అన్నారు.
రాయలసీమ వాదాన్ని తొక్కిపెట్టే కుట్రలో భాగంగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తెరపైకి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఆడిస్తున్న నాటకాల పైన రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
ఉద్యమాల విషయంలో చిరంజీవి నుంచి పవన్ నేర్చుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాయలసీమలో పెట్టవలసిన రాజధానిని అమరావతికి తీసుకు వెళ్తే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఉద్యమంతో ఆయన కోస్తా అభివృద్ధికి కొమ్ము కాస్తున్నాడని ఆరోపించారు.












Click it and Unblock the Notifications