ఎపి శాసన సభ రద్దు, రాష్ట్రపతి పాలనకు సిఫార్సు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర కేబినెట్ శుక్రవారం సాయంత్రం భేటీ అయింది. ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగింది. ఈ భేటీలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అసెంబ్లీని రద్దు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రపతికి ఇందుకు సంబంధించి సిఫార్సు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను అలాగే పొడిగించాలని కేబినెట్ ఓ నిర్ణయానికి వచ్చింది. వారు రాష్ట్రపతికి సిఫార్సు చేసింది.

శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్రపతి పాలన, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దు పైనే చర్చించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర కేబినెట్ భేటీ అయింది.
కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపిఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కిరణ్ రాజీనామా అనంతరం రాష్ట్రపతి పాలనకు కేంద్రం మొగ్గు చూపింది. ఇప్పుడు ఆ రాష్ట్రపతి పాలనను పొడిగించనుంది.












Click it and Unblock the Notifications