కేంద్రకేబినెట్ భేటీకి చిరంజీవి: రాష్ట్రపతి పాలనపై నిర్ణయం
న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో శుక్రవారం ఉదయం కేంద్రమంత్రి మండలి భేటీ అయింది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, పోలవరం ముంపు గ్రామాల అంశాలు చర్చకు రానున్నాయి. భేటీలో 24 అంశాలు చర్చించనున్నారు. రాష్ట్రపతి పాలన 18వ అంశంగా ఉంది. పోలవరం ముంపు గ్రామాలు, ప్రత్యేక ప్రతిపత్తి అంశాలు టేబుల్ ఐటెంగా తీసుకు రానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. కేంద్రమంత్రి చిరంజీవి పాల్గొన్నారు.
మరోవైపు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి ఈ రోజు పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే మహంతిని మరికొంత కాలం ఈ పదవిలో కొనసాగించేందుకు కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మహంతి స్థానంలో కొత్త సిఎస్‌ను నియమించే విషయంలో ప్రభుత్వం నిన్న రాత్రి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

17 మంది సీనియర్ ఐఏఎస్ అధికార్ల పేర్లతో కూడిన ఫైల్‌ను గురువారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పంపారు. అయితే తాను అపద్ధర్మ ముఖ్యమంత్రిని కావడం వల్ల ఫైల్ పై సంతకం చేయలేనని కిరణ్ తిరస్కరించినట్టుగా తెలుస్తోంది.
ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలంటూ గవర్నర్ నరసింహన్ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతుండటం, మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో మహంతినే కొంతకాలం పాటు పదవిలో కానసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications