టీవితో జానా హ్యాపీ, వారు తలదించుకున్నారు(పిక్చర్స్)
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ కేబినెట్ నేపథ్యంలో గురువారం సీమాంధ్ర భగ్గుమనగా, తెలంగాణలో సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ ప్రకటన వెలువడిన వెంటనే సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో సమైక్య వాదులు విధ్యంసాలకు పాల్పడ్డారు. పలు జిల్లాల్లో కాంగ్రెసు పార్టీలకు నిప్పు పెట్టారు. రాళ్ల దాడి చేశారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు అడ్డుకుంటామని చెప్పి మోసం చేశారని సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల ఇళ్లను ముట్టడించారు. ఎపిఎన్జీవో సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధపడింది. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల తెలంగాణలో సంబరాలు జరిగాయి. కేంద్రం నిర్ణయాన్ని హర్షిస్తూ పలువురు కాంగ్రెసు నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో పలుచోట్ల తెలంగాణవాదులు బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుతూ, నృత్యాలు చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

టీవీలలో చూస్తున్న నేతలు
గురువారం తెలంగాణపై కేబినెట్ నోట్ వస్తుందనే వార్తలు జోరుగా రావడంతో టివిల ముందు కూర్చొని ఉత్కంఠగా చూస్తున్న తెలంగాణ ప్రాంత నేతలు జానా రెడ్డి, బస్వరాజు సారయ్య తదితరులు.

తెలంగాణ నేతలు
తెలంగాణపై కేబినెట్ నోట్ వస్తుందనే వార్తలు జోరుగా రావడంతో టివిల ముందు కూర్చొని ఉత్కంఠగా చూస్తున్న తెలంగాణ ప్రాంత నేతలు జానా రెడ్డి, బస్వరాజు సారయ్య తదితరులు. కెమెరాలు క్లిక్ మనిపిస్తున్న దృశ్యం.

సీమాంధ్ర మంత్రులు
తెలంగాణ నోట్ కేబినెట్ ఆమోదం పొందిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి శైలజానాథ్. మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, గంటా శ్రీనివాస రావు, కాసు తదితర ముఖాలు వాడిపోయినట్లుగా ఉన్న దృశ్యం.

కలచివేస్తోంది!
గురువారం రాత్రి తెలంగాణ నోట్ కేబినెట్ ఆమోదం పొందిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్.

చిన్నబోయిన నేతలు
తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో చిన్నబోయిన ముఖంతో ఫోన్లో మాట్లాడుతున్న మంత్రి గంటా శ్రీనివాస రావు, ఇతర నేతలు.

అశోక్ బాబు
కేబినెట్ తెలంగాణ నోట్ ఆమోదించడంతో ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు విలేకరులతో మాట్లాడుతూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications