''ఈ ఒక్క విషయంలో మా మాట వినండి...'' పెరుగుతున్న ఒత్తిడి.. డైలమాలో చంద్రబాబు!

రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే కేంద్రంలో ఉన్న ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు త‌ప్పనిస‌ర‌వుతోంది. 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకున్న సంఘ‌ట‌న‌లు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశాయి. అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్రంతో స్నేహాన్ని కోరుకుంటున్నారు. అటువైపున కేంద్ర పెద్ద‌ల ఆలోచ‌న ఏమిట‌నేది స్ప‌ష్ట‌త లేదు. అయితే తెలుగుదేశం పార్టీ ద్వితీయ‌శ్రేణి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మాత్రం పొత్తు వ‌ద్దంటూ బాబుపై ఒత్తిడి తెస్తున్నారు.

సొంతంగా గెలిచే బలం ఉంది

సొంతంగా గెలిచే బలం ఉంది

లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ్రామ‌స్థాయిలో బూత్ వ‌ర‌కు పూర్తిగా బ‌లం క‌లిగివున్నామ‌ని, క్యాడ‌ర్ ఉంద‌ని, సొంతంగా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెల‌వ‌గ‌లిగేంత బ‌లం పార్టీకి ఉన్న‌ప్ప‌టికీ మ‌న‌ల్ని మనం బ‌ల‌హీనులుగా మార్చుకోవ‌ద్ద‌ని, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏమ‌వుతుంద‌నేది గ‌తంలోను, ఇప్పుడు జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు నిరూపిస్తున్నాయ‌ని బాబుతో చెబుతున్నారు. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొందామంటూ ఒత్తిడి పెంచుతున్నారు.

దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి..

దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి..

ఏపీలో బీజేపీకి ఎంత ఓట్ల శాతం ఉంద‌నేది అంద‌రికీ తెలుస‌ని, మ‌నం ఆ పార్టీ పొత్తు కోసం వెంప‌ర్లాడుతున్నామ‌ని, టీడీపీ ప‌నైపోయింద‌ని, చంద్ర‌బాబు త‌ర్వాత లోకేష్ నాయ‌క‌త్వం వ‌హించ‌లేర‌ని, ఆ పార్టీకి నాయ‌కులు లేరంటూ వ్య‌తిరేక మీడియాలో ప్ర‌చారం చేస్తున్నార‌ని, ప్ర‌జ‌లు కూడా అదే నిజ‌మనుకుంటార‌ని, కావాలంటే గెలుపొందిన త‌ర్వాత బీజేపీకి మ‌ద్ద‌తివ్వొచ్చంటూ కొంద‌రు నేత‌లు బాబుకు సూచించిన‌ట్లు స‌మాచారం. అయితే తన ఆలోచనా వైఖరిని మాత్రం బాబు వెల్లడిచేయలేదని తెలుస్తోంది.

ప్రజల్లో వైసీపీపై సానుభూతి కలిగేలా ప్రచారం చేస్తున్నారు

ప్రజల్లో వైసీపీపై సానుభూతి కలిగేలా ప్రచారం చేస్తున్నారు

తెలుగుదేశం పార్టీ జ‌న‌సేన‌, బీజేపీతో క‌లిసి వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీని ఓడించ‌డానికి కుట్ర ప‌న్నాయంటూ ఆ పార్టీ నేత‌లు ప్ర‌చారం చేసుకోవ‌డంవ‌ల్ల ప్ర‌జ‌ల్లో వారిపై సానుభూతి ఏర్ప‌డుతుందేకానీ మ‌న‌పై సానుకూల‌త పెర‌గ‌డంలేద‌ని చెబుతున్నారు.

మీ హ‌యాంలో ఎన్నోఎన్నిక‌ల‌ను ఎదుర్కొన్నార‌ని, అటువంటి ఇప్పుడు టీడీపీ పొత్తు లేకుండా ఎన్నిక‌ల‌కు వెళ్ల‌లేక‌పోతోందని, ఆ పార్టీ బలహీనపడిందంటూ వైసీపీ చేస్తోన్న ప్ర‌చారం ఇబ్బందికరంగా ఉందంటున్నారు.

ప్ర‌జ‌లు ఓటు వేయాలి అనుకుంటే వేస్తార‌ని, అందులో సందేహం అవ‌స‌రంలేద‌ని, కానీ వారు వ‌ద్దు అనుకుంటే ఓటు వేయ‌ర‌ని, ప్ర‌జ‌లంతా ఇప్పుడు రాష్ట్రాన్నిఅభివృద్ధి ప‌థంలోకి న‌డిపించ‌గ‌లిగేది ఒక్క‌ చంద్ర‌బాబునాయుడే అనుకుంటున్నార‌ని, కాబ‌ట్టి మ‌నం ఒంట‌రిగా ఎన్నిక‌ల‌కు వెళ్లినా వ‌చ్చే ఇబ్బంది లేద‌ని ఒత్తిడి పెంచుతున్నారు. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+