250 కాల్ మనీ కేసులు: చినరాజప్ప, సత్యానందం లొంగుబాటు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 250 కాల్ మనీ కేసులు నమోదయ్యాయని హోంమంత్రి చినరాజప్ప గురువారం నాడు చెప్పారు. తెలిపారు. కాల్ మనీ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పోలీసు శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రంలో ప్రాంతానికి ఓవిధంగా అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారు ద్వందవైఖరి అవలంభిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

Chinna Rajappa

సత్యానందం లొంగుబాటు

కాల్ మనీ - సెక్స్ రాకెట్ నిందితుడు సత్యానందం గురువారం నాడు బెజవాడ న్యాయస్థానం ఎదుట లొంగిపోయాడు. ఇతను కాల్ మనీ కేసులో ఏ4 నిందితుడు. పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిలో నాలుగోవాడు.

కాగా, సత్యానందానికి ఇటీవలే ముందుస్తు బెయిల్ మంజూరయింది. ఇది విజయవాడలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు యలమంచిలి రామ్మూర్తి అలియాస్ రాము, దూడల రాజేష్, భవానీ శంకర్ అరెస్టయి జైలులో ఉన్నారు. చెన్నుపాటి శ్రీను, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ళ శ్రీకాంత్‌ పరారీలో ఉన్నారు.

నూతన ఇసుక విధానంపై ఏపీ మంత్రివర్గ ఉప సంఘం భేటీ

నూతన ఇసుక విధానంపై చర్చించేందుకు ఏపీ మంత్రివర్గ ఉప సంఘం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో బెజవాడలో సమావేశమైంది. ఉప సంఘం సభ్యులు దేవినేని ఉమామహేశ్వర రావు, అచ్చెన్నాయుడు, పీతల సుజాత తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+