కాల్ మనీ: నేను చెప్పినతని వద్దకు వెళ్లు, నా వద్దకు అమ్మాయిల్ని పంపించు!
అమరావతి: విజయవాడ కాల్ మనీ - సెక్స్ రాకెట్‌లో ఎన్నో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో అంశం వెలుగు చూసింది. తాను చెప్పిన వారి వద్దకు వెళ్లాలని, తన వద్దకు అమ్మాయిలను తీసుకు రావాలని కాల్ మనీ నిందితుడు ఓ యువతిని ఫోన్లో బెదిరించాడు.
ఇందుకు సంబంధించి వార్తలు వస్తున్నాయి. నిందితుల్లో యలమంచిలి రాము అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు ఓ కాల్ మనీ బాధితురాలిని ఫోన్ ద్వారా వేధించాడు. ఆమెకు వడ్డీకి అప్పు ఇచ్చాడు. తనకు రూ.6 చొప్పున వడ్డీ చెల్లించాలని బ్లాక్ మెయిల్ చేశాడు.

వెంటనే అప్పు చెల్లించే స్థోమత లేని ఆమెను అతను ఫోన్ ద్వారా బెదిరించాడు. తన వద్దకు అమ్మాయిలను తీసుకు రావాలని చెప్పాడు. నేను చెప్పిన వారి వద్దకు నీవు వెళ్లాలని ఆమెను చెప్పాడు. లేదంటే రూ.6 వడ్డీ చెల్లించాలని చెప్పాడు.












Click it and Unblock the Notifications