కాల్ మనీ షాక్: రెండో భార్యతో ఆమె నగ్నఫోటోలు తీయించాడు

విజయవాడ: బెజవాడలో కాల్ మనీ - సెక్స్ రాకెట్ ఉదంతం మరోసారి కలకలం రేపింది. ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్న కేసులో కాల్ మనీ వ్యాపారి రవికాంత్‌ను పోలీసులు శనివారం నాడు అరెస్టు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

రవికాంత్ ఓ మహిళ వద్ద డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. వాటిని తిరిగి ఇవ్వమని బాధితురాలు అడిగినందుకు రవికాంత్.. తన రెండో భార్య శ్రీదేవితో ఆమె నగ్న ఫోటోలు తీయించినట్లుగా తెలుస్తోంది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రవికాంత్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతనిని విచారిస్తున్నారు. బాధితురాలు శనివారం నాడు తన మద్దతుదారులతో.. రవికాంత్ భార్య ఇంటిముందు ఆందోళన చేపట్టారు. నగ్న చిత్రాలు ఆమె వద్దే ఉన్నాయని, తాను తన అక్క (రవికాంత్ మొదటి భార్య) ఇంటి వద్ద ఉన్నానని ఫోన్లో బెదిరిస్తోందని ఆరోపించారు.

Call Money Sex racket victim protest at accused residence

దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రవికాంత్ మొదటి భార్య ఇంట్లో లేకపోవడాన్ని గుర్తించారు. అనంతరం ఆయన ఇంటి నుంచి పెన్ డ్రైవ్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీదేవి నుంచి అపాయం లేకుండా బాధితురాలికి రక్షణ కల్పిస్తామని పోలీసులు చెప్పారు. దీంతో బాధితురాలు ఆందోళన విరమించారు.

కాగా, రవికాంత్ ఘటనపై సదరు బాధిత మహిళ.. మహిళా సంఘాలతో కలిసి ఆందోళన చేపట్టారు. కృష్ణలంకలోని రవికాంత్ ఇంటి ఎదుట ఆయనకు వ్యతిరేకంగా కొందరు మహిళలు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున వడ్డీ ఆశ చూపి అతను బాధితురాలి వద్ద డబ్బు తీసుకున్నాడని తెలుస్తోంది.

ఇలా విజయవాడ వ్యాప్తంగా దాదాపు కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ డబ్బును కాల్ మనీలో పెట్టుబడిగా పెట్టి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవలే కాల్ మనీ కేసుకు సంబంధించిన కేసులో కూడా అరెస్టయ్యాడు.

వడ్డీకి డబ్బులు తీసుకున్న మహిళలను లైంగికంగా కూడా వేధిస్తున్నాడని ఆరోపణలున్నట్లు పోలీసులు వెల్లడించారు. రవికాంత్‌కు ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని అడిగిన మహిళలను కూడా బెదిరించేవాడని తెలుస్తోంది. రుణంగా మహిళల వద్ద తీసుకున్న డబ్బుని అడిగితే వారి అశ్లీల చిత్రాలను పెన్ డ్రైవ్, డీవీడీలలో సేవ్ చేశానని, వాటిని బయటపెడతానని తరచుగా వేధింపులకు గురిచేసేవాడని బాధితులు వాపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+