పులివెందులలో ఎన్నికల వేళ.. సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉంటూ వస్తోన్న మండల పరిషత్, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ సాయంత్రం 5 గంటలకు తర్వాత పులివెందుల, ఒంటిమిట్టలో ప్రచారం ముగియనుంది. ఈ రెండు చోట్ల కూడా 11 మంది చొప్పున అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. పులివెందుల, ఒంటిమిట్టలో 500 మంది బైండోవర్ కేసులు నమోదయ్యాయి.

ఈ ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇదివరకే వేర్వేరుగా నోటిఫికేషన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. జెడ్పీటీసీ స్థానాల్లో పులివెందుల, ఒంటిమిట్ట ఉన్నాయి. ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాల్సిన జాబితాలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం మణీంద్రం, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని కారంపూడి మండలం వేపకంపల్లి, నెల్లూరు జిల్లా కావలి మండలం విడవలూరు-1 ఎంపీటీసీలు ఉన్నాయి.

Campaign of bypoll for Pulivenduala ZPTC and other seats conclude today Satish Reddy comments

ఈ నేపథ్యంలో పులివెందులకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలను అడ్డుగా పెట్టుకుని తనపై దాడి చేయడానికి కుట్ర జరుగుతోందని విమర్శించారు. తనకు ఏదైనా జరిగితే మంత్రి నారా లోకేష్, పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి ఇద్దరూ దీనికి బాధ్యులని అన్నారు.

వారిద్దరినీ సుమోటోగా తీసుకుని సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై జరగబోయే దాడి గురించి టీడీపీ నేతలే సమాచారం ఇచ్చారని అన్నారు. పులివెందులలో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారంటూ సతీష్ రెడ్డి ఆరోపించారు.

తన మీద దాడి జరగబోతున్నట్టు స్పష్టంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా తనకు సమాచారం అందిందని, తనను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని అన్నారు. తాను నిరాయుధుడినని పేర్కొన్నారు. చేతనైతే తనను కాపాడాలని, జరగకుండా చూడాలని డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

ఈ దాడి స్టేట్ స్పాన్సర్డ్ అని సతీష్ రెడ్డి ఆరోపించారు. మంత్రి నారా లోకేష్, బీటెక్ రవి దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. తనకేదైనా జరిగినా సుమోటోగా వారిద్దరిపై సీబీఐ ద్వారా విచారణ చేయాలని కోరుకుంటోన్నానని అన్నారు. ఇక్కడున్న పోలీసుల ద్వారా న్యాయం జరిగే పరిస్థితులు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక్కడ పోలీసులు పచ్చ కండువాలు వేసుకోని తిరుగుతున్నారుని సతీష్ రెడ్డి ధ్వజమెత్తారు. డీఎస్పీ, రూరల్ సీఐ, డీఐజీ.. టీడీపీ వాళ్లకు పెత్తనం ఇచ్చారని ఆయన విమర్శించారు. నిజాయితీపరులైన అధికారులందరూ పక్కన కూర్చోని ఉన్నారు. ఇప్పుడున్న అధికారుల వల్ల ఎటువంటి న్యాయం జరగదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+