మహిళలు తలనీలాలు ఇవ్వొచ్చా? గరికపాటి, అనంతలక్ష్మీ సంచలన కామెంట్స్

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదెల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడినందుకు ఆమె తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడికి తలనీలాలను సమర్పించారు. అనంతరం అనంతరం తిరుమలకు వచ్చిన భక్తులకు ఒక పూట అన్నదానం కోసం తన కొడుకు మార్క్ శంకర్ పేరిట రూ.17 లక్షలు విరాళం సమర్పించారు.

Can Women Offer Their Hair to God Understanding the Tradition

రష్యాలో జన్మించిన అన్నా లెజినోవా పుట్టుకతోనే క్రిస్టియన్. అయినప్పటికీ గుండు చేయించుకోవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో మహిళలు పుణ్యక్షేత్రాల వద్ద తలనీలాలు సమర్పించడం సరికాదనే అభిప్రాయం సైతం బలంగా వినిపిస్తోంది. అయితే అన్నా లెజినోవా గుండు చేయించుకున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై కొందరు తల్లిప్రేమ, దేవుడిపై భక్తి అని కామెంట్స్ చేస్తుండగా.. మరికొంతమంది మాత్రం అయితే కొందరు మాత్రం మహిళలు గుండు గీయించుకోవడం తప్పని చెబుతున్నారు.

ప్రవచనకర్తలు గరికపాటి, అనంత లక్ష్మి వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఈ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ.. ముత్తైదువలు తిరుమలలో మూడు కత్తెరలు ఇస్తే సరిపోతుంది.. గుండు చేయించుకోవద్దంటూ మాట్లాడారు. ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ అంశం పెద్ద రచ్చగా మారింది.

ఇక మహిళలకు తలనీలాలు ఇవ్వొచ్చా అనే అంశంపైనే.. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మీ మాట్లాడిన వీడియోను మరికొందరు పోస్టు చేస్తున్నారు. అందులో ఆమె ప్రసంగిస్తూ.. నా అహంకారం అంతా వదులుకుంటున్నాను. భగవంతుడు ఇచ్చిన అలంకారం జుట్టు. ఆ జుట్టును నీకిచ్చి అందాన్ని వదులుకుంటున్నాను.. అహంకారాన్ని వదులుకుంటున్నాను అనేది ఆడవాళ్లు జుట్టు ఇవ్వడంలో ఉన్న పరమార్థం. నీ దయ కోసం ఇంతకన్నా కిందకు పడలేను. అని అనంతలక్ష్మీ చెప్పిన మాటలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం పెద్ద చర్చగా మారింది.

అయితే ఈ పోస్టులకు చెక్ పెట్టేందుకు జనసైనికులు రంగప్రవేశం చేశారు. కేసీఆర్ సతీమణి శోభ గతంలో తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన వీడియోను బయటపెట్టారు. 2023 అక్టోబర్‌లో తిరుమల వెళ్లిన కేసీఆర్ సతీమణి.. శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అప్పుడు లేవని నోరు ఇప్పుడెలా లేస్తోందని జన సైనికులు సామాజిక మాధ్యమాల్లో మండిపడుతున్నారు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+