దర్శకులెందుకు?, సినిమా సెట్టింగులు అనుకుంటున్నావా!: బాబుకు ఐవైఆర్ చురక
రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబు వైఖరి నిర్లక్ష్యంగా ఉందన్నారు ఐవైఆర్.
అమరావతి: ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వంపై తన విమర్శలను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన హోదాలో ఉంటూనే సర్కారు విధివిధానాలను ఎండగట్టినందుకు అప్పట్లో ఆయనపై వేటు పడిన సంగతి తెలిసిందే.
Recommended Video

ఇక అప్పటినుంచి సీఎం చంద్రబాబు వైఖరి పట్ల ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా రాజధాని అమరావతి నిర్మాణం గురించి కూడా ఆయన స్పందించారు. రాజధాని అంటే సినిమా సెట్టింగ్ కాదని, ఇబ్బందులు వస్తే నష్టపోయేది ప్రజలే అని గుర్తుచేశారు.
రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబు వైఖరి నిర్లక్ష్యంగా ఉందన్నారు.సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే రాజధాని నిర్మాణంలో ఇన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని విమర్శించారు. రాజధాని నిర్మాణం కోసం రాజమౌళి లాంటి దర్శకులను సంప్రదించడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు.

అసలు రాజధాని నిర్మాణానికి దర్శకులెందుకని సూటిగా ప్రశ్నించారు. ముందు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలని ఆయన సూచించారు.
కాగా, రాజధాని డిజైన్ల విషయంలో ప్రభుత్వం ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుబారా చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్, లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ డిజైన్లను చంద్రబాబు తిరస్కరించారు. తొలుత జపాన్ కంపెనీ ఇచ్చిన డిజైన్లను అద్భుతమంటూ పొగిడి ఆపై మాట మార్చేశారు.
చివరకు ఫోస్టర్ సంస్థకు సలహాలిచ్చి డిజైన్లు రూపొందించే బాధ్యతను బాహుబలి దర్శకుడు రాజమౌళికి అప్పగించారు. ఆ డిజైన్లు ఎప్పటికి పూర్తవుతాయో!, అమరావతి నిర్మాణం ఎప్పటికి సాకారమవుతుందో కనీసం అంచనా కూడా వేయలేని పరిస్థితి.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications