న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం. నదిలోకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి

ఆనందాన్ని నింపాల్సిన నూతన సంవత్సర వేడుకలు పలువురి జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. కొంతమంది యువకులకు ఇదే చివరి న్యూ ఇయర్ అయింది. కొత్త సంవత్సర వేడుకలను బీచ్‌లో జరుపుకోవడానికి వెళ్లిన వారిలో ఒకరు కారుతో సహా మాయమై.. శవమై కనిపించారు. బుధవారం రాత్రి బీచ్ లో జరిగిన సీన్ అంతా సస్పెన్స్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే

కాకినాడ టౌన్ కు చెందిన నిమ్మకాయల శ్రీధర్‌(35), కాకినాడ మండలం వాకలపూడి గ్రామనికి చెందిన నందమూరి వెంకటసాయినాథ గోపీకృష్ణ, బెంగళూరుకు చెందిన బొండాడ సూర్యకిరణ్ అంతర్వేది బీచ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్లారు. ఓ రిసార్ట్ లో రూమ్ తీసుకున్నారు. అనంతరం కారులో బయలు దేరిన ఈ ముగ్గురు అర్ధరాత్రి వరకూ ముగ్గురూ బీచ్‌లో తిరిగారు. సెలబ్రేషన్స్ అన్ని ముగించుకున్నారు. బాగా అలిసిపోయిన సూర్యకిరణ్‌ రెస్ట్ తీసుకోవడానికి రిసార్ట్ లోన రూమ్ కు వెళ్లిపోయాడు. మిగిలిన ఇద్దరూ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బీచ్ లో కార్ తో స్టంట్లు చేశారు. హై స్పీడ్ లో కార్ డ్రైవింగ్ చేస్తూ.. రచ్చ రచ్చ చేశారు.

అయితే హైస్పీడ్ లో ఉన్న కారు ఈ క్రమంలోనే కంట్రోల్ తప్పిది. సాగర సంగమం ప్రాంతంలోని అన్నాచెల్లెళ్ల గట్టుగా పిలవబడే చోట గోదావరి నది సముద్రంలో కలిసే మలుపు వద్ద కారు నీళ్లలోకి దూసుకుపోయింది. అప్రమత్తమైన గోపీకృష్ణ కార్ డోర్లు తీసే ప్రయత్నం చేసి అతి కష్టం మీద బయటపడ్డాడు. ఈ లోపే కార్ చాలా లోతుకు వెళ్లిపోయింది. నీటిలో కొట్టుమిట్టాడుతున్న గోపీకృష్ణ రక్షించడంటూ అరవగా.. అక్కడే ఉన్న యువకులు గమనించి అతడ్ని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.

అయితే కారుతో సహా శ్రీధర్ నీటిలో ముగిపోయాడు. రాత్రంతా గాలించినా చీకటిగా ఉండటం.. సముద్రంలో నది కలిసే ప్రాంతం కావడంతో గాలింపు చర్యలు కష్టంగా మారాయి. గురువారం ఉదయాన్నే రంగంలోకి దిగిన మెరైన్‌ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈత గాళ్ల సాయంతో కారును గుర్తించారు. అనంతరం పొక్లెయిన్‌తో కారును బయటికి తీశారు. డ్రైవింగ్ సీట్ లో ఉన్న శ్రీధర్‌ మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి కారును బీచ్ లో తిప్పి ప్రమాదానికి కారణమయ్యారని కేసు నమోదు చేశారు సఖినేటిపల్లి పోలీసులు.

Car Plunges into Sea at Antarvedi Beach During New Year Celebrations One Youth Dies

న్యూ ఇయర్ వేడుకల కోసం అంతర్వేది బీచ్‌కు వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఒకరు కారుతో సహా గల్లంతయ్యారు. గోదావరి నది సముద్రంలో కలిసే చోట మలుపు వద్ద కారు నీళ్లలోకి దూసుకుపోయింది. ఒక యువకుడు బయటపడగా, శ్రీధర్ అనే మరో యువకుడు కారులోనే మృతి చెందాడు. పోలీసులు కారును బయటకు తీసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో శ్రీధర్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+