నిద్రపోయే ముందు రెండు యాలకులు నమిలితే - ఆ సమస్యలకు చెక్..!!

యాలకులు. ఒక మసాలా దినుసే కాదు.. ఎన్నో రకాల ప్రయోజాలు అందిస్తుంది. ప్రతీ ఇంటా యాలకులు వినియోగిస్తారు. యాలకులు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని రకరకాల ఆహారాల్లో, టీ లో ఉపయోగిస్తారు. సువాసనతో పాటుగా ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇండియన్ ఫుడ్ లో యాలకులకు ప్రత్యేక స్థానం ఉంది. యాలకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు వీటిని నమలడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.

యాలకుల్లో ఔషదగుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో జింక్, విటమిన్ సి, ఐరన్, రిబోఫ్లేవిన్, సల్ఫర్, నియాసిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎన్నో విధాలుగా ప్రయో జనాలు అందిస్తాయి . యాలకులను వీటిని తినడం వల్ల మనం ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. అదే విధంగా అనారోగ్య సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. ముఖ్యంగా రోజు కు రెండు యాలకులు తింటే మాత్రం వీటివల్ల ఎన్నో బెనిఫిట్స్ ను అందుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యాలకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసనను కలిగించే జబ్బులతో మీ శరీరం పోరాడటానికి సహాయపడుతుంది. యాలకులు నోటి నుంచి తాజా వాసన వచ్చేలా చేస్తాయి. కాగా, రాత్రి సమయంలో చాలామందికి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక ఇబ్బంది పడుతారు. వీరు పడుకునే ముందు ఒకటీ రెండూ యాలకులు నమలడం వల్ల లాలాజలంలో జీర్ణరసం పెరుగుతుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

నిలిచిన మున్సిపల్ పోల్స్ ఇక అప్పుడే - అర్ద్రరాత్రి కీలక పరిణామాలు..!!
నిలిచిన మున్సిపల్ పోల్స్ ఇక అప్పుడే - అర్ద్రరాత్రి కీలక పరిణామాలు..!!
cardamom-health-benefits-of-eating-two-pods-before-bed-support-for-digestion-and-fresh-breath

నిపుణుల సూచనలు

దీని ద్వారా ఉదయం మలబద్ధకం, గుండెల్లో మంట లాంటి సమస్యలు తగ్గుతాయి. యాలకులలోని సహజ సుగంధ సమ్మేళనాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి, మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. అలాగే నిద్రలేమి సమస్యలూ తగ్గుతాయి. యాలకులలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటీలో బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఉదయం పూట నోటి దుర్వాసన రాకుండా నివారిస్తాయి. దానితోపాటు రాత్రివేళ శ్వాసనాళాల్లో పేరుకుపోయే కఫాన్ని తొలగించి గొంతు నొప్పి, గురక వంటి సమస్యలను తగ్గిస్తాయి. రాత్రి పడుకునే 20 నుంచి 30 నిమిషాల ముందు ఒకటి లేదా రెండు పచ్చి యాలకులను బాగా నమలాలి. తరువాత గోరువెచ్చని నీటిని తాగాలి. జీర్ణవ్యవస్థలో ఎలాంటి సమస్య ఉన్నా తగ్గిపోతుంది. ముఖ్యంగా గ్యాస్ సమస్య వెంటనే తగ్గిపోతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కావాలనుకుంటే యాలకుల పొడిని పాలల్లో మరిగించి కూడా తాగటం ద్వారా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+