కోడ్: పోలీసుల్ని చూసి గోడ దూకి పారిపోయిన జగ్గారెడ్డి

పోలీసులను గమనించగానే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, ఓటర్లు పరుగులు పెట్టారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఫంక్షన్ హాల్ గోడ దూకి పారిపోయారు. ఈ దృశ్యాన్ని పోలీసులు వీడియోలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఒక మహిళ సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అక్కడ ఉన్న వివిధ రకాల వంట సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఫంక్షన్ హాలులో జగ్గా రెడ్డి తన భార్య జన్మదిన వేడుకల పేరిట విందు ఏర్పాటు చేసి అందర్నీ ఆహ్వానించారు. కార్యక్రమానికి కార్యకర్తలతో కలిసి వచ్చిన జగ్గారెడ్డి... 300 సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. మరో ఎనిమిది బాక్సుల్లో ఉన్న 200 సెల్ ఫోన్లు పంపిణీ చేస్తుండగా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చారు.
పోలీసులు గాలించి.. 500 సెల్ ఫోన్లు, అతి ఖరీదైన మద్యం సీసాలు, ఎలక్షన్ ఐడిల లిస్టులు గుర్తించారు. వాటిని సీజ్ చేశారు. కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. ఈ ఫంక్షన్ హాలుకు చేరుకునేందుకు సంగారెడ్డి నియోజకవర్గంలోని పలువురు ఓటర్లను పదుల సంఖ్యలో వాహనాల్లో తరలించారు.












Click it and Unblock the Notifications