హరీష్‌ను ఏకేసిన జీవన్, బాబును అనొద్దని వైసీపీ నేత!

హైదరాబాద్: తెరాస ప్రభుత్వం పైన, మంత్రి హరీష్ రావు పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సోమవారం సభలో మండిపడ్డారు. మంత్రి హరీష్ రావు కల్పించుకొని మాట్లాడిన సమయంలో.. ఆయన సభా మర్యాదలు నేర్చుకోవాలని, ఆయన మంత్రిలా బిహేవ్ చేయడం లేదన్నారు. తమ హయాంలో రైతుల ఆత్మహత్యకు తాము బాధ్యత వహించామన్నారు. రైతులకు ఏడు గంటల పాటు విద్యుత్ ఇచ్చామని, ఇప్పుడు నాలుగు గంటలు కూడా రాలేదన్నారు.

తెరాస అధికారంలోకి వచ్చాక ఈ నాలుగు నెలల్లోనే నాలుగు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఒక్క మెదక్ జిల్లాలోనే 76 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారన్నారు. ఈ ఆత్మహత్యల అంశంపై మాత్రం ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏడు గంటల పాటు విద్యుత్ అందించామని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైలు పైనే చేశారన్నారు. ఇప్పుడు నాలుగు గంటలకు మించి విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. ఈ కారణంగా కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.

Jeevan Reddy says, government is responsible for suicides

గతంలో వర్షాలు బాగున్నప్పటికీ రైతుల ఆత్మహత్యలు జరిగాయని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వం హయాంలోనే ఆత్మహత్యలు ఉన్నట్లు విపక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.

తమది చేతల ప్రభుత్వమే తప్ప, ప్రచారం చేసుకునేది కాదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా విపక్షాలు వ్యవహరించాయన్నారు. యూపీఏ మొత్తంగా రూ.3000 కోట్ల రుణమాఫీ చేస్తే, తాము మొదటి విడతగానే 4250 కోట్లు రుణమాఫీ చేశామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతాంగానికి నిధులు కేటాయించామన్నారు.

తెలంగాణకు రావాల్సిన విద్యుత్ కోసం అందరం కలిసి పోరాడుదామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం తాము ప్రభుత్వంతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ బిడ్డగా తాను ప్రభుత్వానికి మద్దతిస్తానని చెప్పారు. చంద్రబాబు పైన నెపం వేయకుండా మనమే సమస్యను పరిష్కరించుకుందామన్నారు. లేకుంటే మనం చేయలేక చంద్రబాబుపైకి నెడుతున్నామనే భావన ప్రజల్లో ఏర్పడుతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+