ప్రజలను రెచ్చగొట్టేలా..: జగన్‌కు షాక్, సాక్షి పత్రిక పైన కేసు

Posted By:
Subscribe to Oneindia Telugu

రాజమహేంద్రవరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక పైన కేసు నమోదయింది. తప్పుడు వార్తలు రాసినందుకు రాజమహేంద్రవరం పోలీసులు సాక్షి పైన కేసు నమోదు చేశారు.

కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తున్న సమయంలో ఆయన ఆసుపత్రిలో ఉండగా, వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌కు విరుద్ధంగా వార్తలు ప్రచురించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు వార్తలు ప్రచురించిందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: విస్తరణ: ఏపీ-తెలంగాణలకు నో, 6గురు మంత్రులకు మోడీ ఉద్వాసన

Case against Sakshi paper in Rajamahendravaram

కుల మత విద్వేషాలు రెచ్చగొడుతూ సమాజంలో అశాంతి రేపేందుకు ప్రయత్నించారని ఫిర్యాదు నమోదయింది. ఐపీసీ సెక్షన్ 153(ఏ) కింద సాక్షి ఎడిటర్, రెసిడెంట్ ఎడిటర్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో సాక్షి పత్రికకు నోటీసులు జారీ చేయనున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Case against YS Jagan's Sakshi paper in Rajamahendravaram.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి