బాలికలతో వెట్టిచాకిరీ.. బాడీ మసాజ్.. టీవీ యాంకర్ నిర్వాకం
హైదరాబాద్‌లో దారుణం వెలుగుచూసింది. ఇద్దరు బాలికలతో వెట్టిచాకిరీతో పాటు బాడీ మసాజ్ చేయించుకుంటున్న ఓ టీవీ యాంకర్ నిర్వాకం బయటపడింది. ఆ బాలికలను ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడు చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్(CCI)విద్యార్థులుగా గుర్తించారు. ఇటీవల చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్ నుంచి ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయినట్టుగా సీడబ్ల్యూసీ(Child Welfare Committee) అధికారులకు ఫిర్యాదు అందడంతో.. దానిపై దర్యాప్తు చేయగా హైదరాబాద్‌లోని టీవీ యాంకర్ ఇంట్లో వారిని గుర్తించారు.

కాగా,సీసీఐలో చదువుకుంటున్న ఆ విద్యార్థులను సంక్రాంతి పండగ సెలవుల నిమిత్తం తల్లి హైదరాబాద్‌కు తీసుకెళ్లింది. ఆపై అక్కడే ఓ టీవీ యాంకర్ ఇంట్లో బాలికలను పనికి కుదిర్చింది. సెలవులు ముగిసి చాలారోజులు అయినప్పటికీ బాలికలు చైల్డ్ కేర్‌కి రాకపోవడంతో సీడబ్ల్యూసీ అధికారులకు ఫిర్యాదు అందింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. హైదరాబాద్‌లోని ఓ టీవి యాంకర్ ఇంట్లో బాలికలు పనికి కుదిరినట్టు గుర్తించారు. దీనిపై నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ బాలికలను పనిలో పెట్టుకోవడంపై వారిని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టరీత్యా మైనర్లతో పనిచేయించుకోవడం నేరం కాబట్టి సదరు యాంకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కొత్త బిజినెస్ షురూ చేసిన తెలుగు యాంకర్..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications