వైసీపీకి షాక్: జగన్‌పై కేసు నమోదు, టిడిపికి ప్లస్ అవుతుందా?
నంద్యాల మూడో పోలిస్‌స్టేషన్‌లో వైఎస్ జగన్‌పై కేసు నమోదైంది.ఈసీ ఆదేశాల ప్రకారంగా పోలీసులు ఈ కేసును నమోదు చేశారు.ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలను పురస్కరించుకొని నిర్వహించిన పలు ఎన్నికల సభల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ చీఫ్ జగన్‌పై నంద్యాల మూడవ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఈ విమర్శలపై టిడిపి నేతలు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడ ఈ విషయమై తీవ్రంగా స్పందించింది. జగన్ వ్యవహరించిన తీరును ఎన్నికల సంఘం తప్పుబట్టింది.
జగన్ విమర్శలు ఎన్నికల నిబంధనల కిందకే వస్తాయని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. దరిమిలా కేసులు నమోదు చేయాలని పలువురు టిడిపి నేతలు డిమాండ్ చేశారు.

జగన్‌పై నంద్యాలలో కేసు నమోదు
నంద్యాల ఉప ఎన్నికలను పురస్కరించుకొని ఏపీ సీఎం చంద్రబాబుని కాల్చేయాలని, ఉరితీసినా తప్పులేదని జగన్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు. జగన్ వ్యాఖ్యలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయన వ్యాఖ్యలు కచ్చితంగా నిబంధనల ఉల్లంఘనల కిందే వస్తుందని పేర్కొంది. ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నంద్యాలలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఈ రోజు కేసు నమోదు చేశారు. ఐపీసీ 188, 504, 506 ప్రజా ప్రాతినిధ్య చట్టం 125 ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

జగన్‌పై టిడిపి ఫిర్యాదు
పోలింగ్‌కు మూడు రోజుల ముందు నుండి టిడిపి నేతలు వైసీపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు.ఎన్నికల ప్రచాంరలో వైసీపీ చీఫ్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా జగన్‌పై కేసులు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో బుదవారం సాయంత్రం నంద్యాల పట్టణంలో వైసీపీ చీప్ జగన్‌పై కేసు నమోదైంది.పోలింగ్‌కు ముందుగా రెండు పార్టీల నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరగడమే ప్లస్
నంద్యాల ఉప ఎన్నికలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పోలింగ్ శాతం భారీగా ఉందని... 90 శాతం పోలింగ్ నమోదైనా ఆశ్చర్యం లేదన్నారు.. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నారని... ఇది టీడీపీకి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పారు. ఈ ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు, ఉదయం నుంచి ప్రశాంతంగా పోలింగ్ జరిగినప్పటికీ... చివరి క్షణాల్లో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

ఉప ఎన్నికల్లో ఓటింగ్ కు ఉత్సాహం
సాధారణంగా ఉపఎన్నికల్లో ఓటింగ్‌కు ఎక్కువమంది ఆసక్తిని చూపరు. కానీ, నంద్యాల ఉపఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కన్పిస్తోంది. అయితే పురుషుల కంటే స్త్రీ ఓటర్లే ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ప్రయత్నించారు.అయితే మహిళ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపారనేది ప్రస్తుతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications