Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వల్లభనేని వంశీ ఉక్కిరి బిక్కిరి, ఊహించని పరిణామం..!!

ఏపీలో రాజకీయ లెక్కలు ఆసక్తి కరంగా మారాయి. కూటమి నేతలు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తమ వ్యూహాలు అమలు చేస్తున్నారు. 15 ఏళ్లు కూటమి అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని మాజీ సీఎం జగన్ ప్రతీ సందర్భంలోనూ చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాల పైన పోరుబాట కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో సుదీర్ఘంగా జైలులో ఉండి.. బయటకు వచ్చిన వల్లభనేని వంశీ కి ఊహించని షాక్ తగిలింది. దీంతో.. నెక్స్ట్ స్టెప్ పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వంశీ పలు కేసుల్లో సుదీర్ఘ కాలం జైలులో ఉన్నారు. బెయిల్ పైన బయటకు వచ్చారు. అస్వస్థతకు గురైన వంశీ కొద్ది రోజులుగా తిరిగి పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ సమయంలో తాజాగా మాచవరం పోలీస్ స్టేషన్‌లో వల్లభనేని వంశీపై ఇవాళ(గురువారం) కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వంశీపై కేసు నమోదు చేశారు. 2024లో జులైలో తనపై వంశీ ఆయన అనుచరులు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వంశీతో సహా మరో ఎనిమిది మందిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.

case-registered-against-vallabhaneni-vamsi-in-machavaram-police-station-details-here

2019లో గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ.. తరువాత జగన్ కు దగ్గరయ్యారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి గన్నవరం అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. కూటమి అధికారం లోకి వచ్చిన తరువాత వంశీ పైన ఉన్న కేసులతో అరెస్ట్ చేసారు. సత్యవర్థన్‌ను వంశీ అండ్ కో కిడ్నాప్ చేసి దాడి చేశారనే కేసులో పోలీసులు అరెస్ట్ చేసారు. 2023లో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. అయితే ఈ దాడిలో ప్రధాన సాక్షిగా సత్యవర్థన్ ఉన్నారు. ఈ ఘటనలో ఆయన ఇచ్చిన ఫిర్యాదే కీలకంగా మారింది. ఈ క్రమంలో సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. నకిలీ ఇళ్ల‌పట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా వంశీ జైలులో ఉన్నారు. ఇక.. ఇప్పుడు మరో కేసు నమోదు కావటం తో తరువాతి చర్యల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+