Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2ఆలయాలు, దర్గాలో నగదు, నగలు చోరీ(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని బోయిన్‌పల్లిలోని రెండు ఆలయాలు, ఓ దర్గాలో ఆదివారం దొంగతనం జరిగింది. హుండీలను పగులగొట్టి నగదు, నగలు అపహరించారు. బోయిన్‌పల్లి పోలీసులు ఘటన స్థలాలకు చేరుకుని, క్లూస్ టీంను రప్పించి వివరాలను సేకరించారు.

చోరీకలు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నందమూరినగర్‌లోని మేడ్చల్ రహదారిలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ తలుపులకు వేసిన తాళాలను పగలగొట్టిన దొంగలు, లోపలికి ప్రవేశించి హుండీని ఎత్తుకెళ్లారు. ఆ హుండీలో దాదాపు రూ. 10వేల నగదు, విలువైన ఆభరణాలు ఉన్నాయని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా, నందమూరినగర్‌లోని కలర్స్ దాబా సమీపంలో ఉన్న నల్లపోచమ్మ ఆలయంలోని హుండి సొమ్మును దొంగలు ఎత్తుకెళ్లారు. ఆలయం చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప చువ్వలను ఇనుపరాడ్లతో తొలగించి చోరీకి పాల్పడ్డారు.

కలర్స్ దాబా వనుక ఉన్న ఖాజీం సాహెబ్ దర్గాలో ఏర్పాటు చేసిన హుండీలోని సొమ్మును కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. హుండీని ఇనుప రాడ్లతో తెరిచి అందులోని నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

నల్లపోచమ్మ ఆలయంలో..

నల్లపోచమ్మ ఆలయంలో..

నగరంలోని బోయిన్‌పల్లిలోని రెండు ఆలయాలు, ఓ దర్గాలో ఆదివారం దొంగతనం జరిగింది. హుండీలను పగులగొట్టి నగదు, నగలు అపహరించారు.

నల్గపోచమ్మ ఆలయంలో..

నల్గపోచమ్మ ఆలయంలో..

బోయిన్‌పల్లి పోలీసులు ఘటన స్థలాలకు చేరుకుని, క్లూస్ టీంను రప్పించి వివరాలను సేకరించారు.

దర్గాలో..

దర్గాలో..

కలర్స్ దాబా వనుక ఉన్న ఖాజీం సాహెబ్ దర్గాలో ఏర్పాటు చేసిన హుండీలోని సొమ్మును కూడా దొంగలు ఎత్తుకెళ్లారు.

దర్గాలో..

దర్గాలో..

హుండీని ఇనుప రాడ్లతో తెరిచి అందులోని నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.

అభయాంజనేయ స్వామి ఆలయంలో..

అభయాంజనేయ స్వామి ఆలయంలో..

నందమూరినగర్‌లోని మేడ్చల్ రహదారిలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ తలుపులకు వేసిన తాళాలను పగలగొట్టిన దొంగలు, లోపలికి ప్రవేశించి హుండీని ఎత్తుకెళ్లారు.

అభయాంజనేయ స్వామి ఆలయంలో..

అభయాంజనేయ స్వామి ఆలయంలో..

ఆ హుండీలో దాదాపు రూ. 10వేల నగదు, విలువైన ఆభరణాలు ఉన్నాయని ఆలయ అధికారులు తెలిపారు.

అభయాంజనేయ స్వామి ఆలయంలో..

అభయాంజనేయ స్వామి ఆలయంలో..

చోరీ ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+