ఆడియో టేప్ లీక్: స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఏం మాట్లాడారు?
హైదరాబాద్ : ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింతగా చిక్కుల్లో పడ్డారు. రేవంత్‌రెడ్డి కాల్‌డేటాను ఏసీబీ వెలికి తీసింది. అరెస్టుకు ముందు 4 రోజులు.. తర్వాత 3 రోజుల కాల్‌డేటాను ఏసీబీ పరిశీలన చేసింది. ఫోన్ సంభాషణల్లో 50 నుంచి 75 సార్లు చంద్రబాబు ప్రస్తావన వచ్చిందని అధికారులు తెలిపారు. రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహా ఫోన్‌లకు వచ్చిన కాల్స్‌పై అధికారులు ఆరా తీశారు. 20 మంది కాల్‌డేటాను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో జరిపిన ఆడియో టేప్‌ను తెలుగు టీవీ న్యూస్ చానెల్స్ లీక్ చేశాయి.

బాబు - స్టీఫెన్ మధ్య ఫోన్ సంభాషణ
చంద్రబాబు తరపు మనిషి - హాలో.. యా బ్రదర్.. బాబుగారు గోయింగ్ టు టాక్ టు యూ బి ఆన్ ద లైన్..(హలో బ్రదర్ బాబు గారు మీతో మాట్లాడుతారు.. లైన్‌లో ఉండండి)
స్టీఫెన్ : యా..
బాబు : హలో..
స్టీఫెన్ : సార్.. గుడ్ ఈవినింగ్ సార్..
బాబు : హౌ ఆర్ యూ(మీరు ఎలా ఉన్నారు?).
స్టీఫెన్ : ఫైన్ థాంక్యూ సార్..
బాబు : మనవాళ్లు బ్రీఫ్డ్ మీ.. ఐయామ్ విత్ యూ.. డోంట్ బాదర్..(మనవాళ్లు నాకంతా వివరించారు.. మీకు అండగా నేను ఉంటా.. కంగారు పడాల్సిందేమీ లేదు).
స్టీఫెన్ : యస్ సార్.. రైట్ సార్.
బాబు : ఫర్ ఎవ్రీథింగ్ ఐయామ్ విత్ యూ.. వాట్ ఆల్ దే స్పోక్.. విల్ హానర్..(అన్నింటికి మీకు నేను అండగా ఉంటా.. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం).
స్టీఫెన్ : యస్ సార్.. రైట్ సార్..
బాబు : ఫ్రీలీ యూ కెన్ డిసైడ్.. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్..(మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు....ఎలాంటి సమస్య లేదు).
స్టీఫెన్ : ఓకే సార్..
బాబు : దటీజ్ అవర్ కమిట్‌మెంట్.. వి విల్ వర్క్ టు గెదర్(అది మా హామీ.. మనం కలిసి పని చేద్దాం).
స్టీఫెన్ : రైట్.. థాంక్యూ సార్..
బాబు : థాంక్యూ..












Click it and Unblock the Notifications