నోటుకు ఓటు: బాబు స్కెచ్ వేశారా? ఫోన్ నెంబర్లు ఇవే...
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో అరెస్టయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య ఫోన్ కాల్స్ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రను పట్టిస్తున్నట్లు చెబుతున్నారు. సండ్ర రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుపై పాత్రను వెల్లడి చేసే అంశాలున్నాయని చెబుతున్నారు. ఈ మేరకు మీడియాలో బుధవారం వార్తాకథనాలు వచ్చాయి.
నోటుకు ఓటు వ్యవహారానికి సెబాస్టియన్, రేవంత్ రెడ్డి, సండ్రలతో కలిసి చంద్రబాబు స్కేచ్ వేశారని ప్రచారం జరుగుతోంది. సండ్ర రిమాండ్ రిపోర్టులో కుట్ర ప్రారంభమైనప్పటి నుంచి ఎమ్మెల్యే కొనుగోలు వ్యహారం దాకా చోటు చేసుకున్న పరిణామాలను ఎసిబి గుదిగుచ్చినట్లు వివరించినట్లు చెబుతున్నారు.
సండ్ర రిమాండ్ రిపోర్టును మంగళవారం ఏసీబీ కోర్టుకు సమర్పించింది. స్టీఫెన్‌సన్ కొనుగోలుకు ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో జరిగిన టీడీపీ మహానాడు వేదికగానే కుట్ర జరిగిందని, చంద్రబాబు నివాసం కూడా ఈ కుట్రలో ఉందని రిమాండ్ డైరీలో ప్రస్తావించిన సంభాషణల్లో తేటతెల్లమవుతున్నట్లు చెబుతున్నారు.

సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రను అరెస్ట్ చేసిన ఏసీబీ మంగళవారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెడుతూ సమర్పించిన రిమాండ్ డైరీ ఈ కుట్రలో ఎమ్మెల్యే సండ్ర పాత్రను వెల్లడించింది. మహానాడులోసైతం చంద్రబాబు మనసంతా కుట్ర చుట్టూనే తిరిగిందని డైరీలో ప్రస్తావించిన నేతల సంభాషణల్లో వెల్లడవుతున్నదని చెబుతున్నారు.
మే 31న రేవంత్‌తో పాటు సెబాస్టియన్, ఉదయ్‌సింహాలను అరెస్ట్ చేసిన ఏసీబీ వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను శాస్త్రీయ పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌ఎస్‌ఎల్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక, సెల్‌ఫోన్ల నిశిత పరీశీలనతో సెబాస్టియన్ ఫోన్‌లో మే 23 నుంచి 31 వరకు రికార్డ్ అయి ఉన్న ఆడియోలు, ఫోన్ కాల్ నంబర్లను బట్టి సీడీఆర్ (కాల్ డాటా రికార్డ్)లను తీసుకుంది. సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి కూడా సెబాస్టియన్, రేవంత్, సండ్ర కాల్స్ వివరాలు తీసుకొని పరిశీలించినట్టు ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ డైరీలో స్పష్టంచేసింది.
ఎవరెవరితో ఎప్పుడు.. ఎన్నిసార్లు..
సండ్ర మొబైల్ నంబర్ 8790825678 నుంచి రేవంత్ ఫోన్ (9505900009)కు 24వతేదీ నుంచి 31 వరకూ 18 కాల్స్ వెళ్లాయి. సండ్ర రెండో నంబర్ 9440625955 నుంచి రేవంత్‌రెడ్డి రెండో నంబర్ (8790900009)కు 24వతేదీ నుంచి 31వరకు రెండుసార్లు కాల్స్ వెళ్లాయని కాల్ డాటాను బట్టి తేలిందని అంటున్నారు.
సండ్ర తన మొబైల్ నంబర్ 8790825678 నుంచి 27.5.2015 నుంచి 31.5.2015వరకు సెబాస్టియన్ ఫోన్ 9394326000కు 19సార్లు, 9440625955 నుంచి ఇదే నంబర్‌కు 12సార్లు కాల్ చేశారు.












Click it and Unblock the Notifications