బెదిరింపులు.. కాదు, దేశభద్రతకు ముప్పు!: మత్తయ్య కాల్ డేటాపై టెలికం కంపెనీలు

హైదరాబాద్: జెరూసలేం మత్తయ్య, ఆయన కుటుంబ సభ్యులు గత నెల రోజుల్లో ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారన్న విషయాలు బయటకు తెలిస్తే దేశభద్రతకు ముప్పు అని టెలికం సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ఇది అందరికీ విస్మయం కలిగిస్తోంది. ఈ మేరకు టెల్కోలు విజయవాడ కోర్టుకు లిఖిత పూర్వకంగా రాసిచ్చారు.

ఏపీ సీఎం చంద్రబాబు సన్నిహితుల ఫోన్‌ నెంబర్లను తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల లేఖలతో సర్వీస్‌ ప్రొవైడర్లు ట్యాప్‌ చేసినట్లు ఏపీ పోలీసులు ఏర్పాటు చేసిన సిట్‌ గుర్తించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గ ఆధారాలను సంపాదించి సర్వీస్‌ ప్రొవైడర్లకు నోటీసులు ఇచ్చింది.

విజయవాడకు పిలిపించి విచారించింది. ఈ సందర్భంగా అన్ని విషయాలనూ వెల్లడించిన సర్వీస్‌ ప్రొవైడర్లు ఆధారాలను ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో, సిట్‌ అధికారులు విజయవాడ కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం వాటికి సమన్లు జారీ చేసింది.

 Cash for vote: Service providers counter in Court

కోర్టుకు హాజరైన సర్వీస్‌ ప్రొవైడర్లు తమ వాదన వినిపించారు. ఆధారాలను బయట పెట్టొద్దని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు తమపై ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా మాట్లాడితే మీరు కంటెంట్‌ ఆఫ్‌ కోర్టు అవుతారు తెలుసా..? అనడంతో.. తమకు నెల సమయం కావాలన్నారు. ఏపీ పోలీసులు అడిగిన నెంబర్లపై తాము కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు.

ఆ నెంబర్లలో దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన విషయాలు ఉన్నాయని రాతపూర్వక సమాధానంలో వివరించారు. అయితే, తాము మత్తయ్య, ఆయన భార్య, సోదరుడు, సెబాస్టియన్‌ కాల్‌డేటా వివరాలు అడిగామని, వాళ్లంతా సామాన్యులేనని, వారితో దేశ అంతర్గత భద్రతకు ముప్పు ఉండడం ఏమిటని ఏపీ పోలీసులు చెప్పారు.

సోదరుడిని కాపాడుకోలేక అత్తారింట్లో దాక్కున్న మత్తయ్య అంతర్గత భద్రతకు ముప్పు కలిగిస్తాడా? అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, హోం శాఖ కార్యదర్శి ఇప్పటికే సెలవుపై వెళ్లడంతో సీసీఎస్‌ పోలీసులు సర్వీస్‌ ప్రొవైడర్లపై ఒత్తిడి తెస్తున్నారని అనుమానిస్తున్నారు. దీనిపై ఏపీ పోలీసులు ఏం చేయాలో నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+