కలకలం: చంద్రబాబు కాన్వాయ్‌కి అడ్డొచ్చిన మందుబాబు(వీడియో)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వింత అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న వాహనశ్రేణి(కాన్వాయ్)కి మందుబాబులు అడ్డు వచ్చాడు. దీంతో కాసేపు కలకలం రేగింది. శంషాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

గన్నవరం వెళ్లడానికి గురువారం ఉదయం 9 గంటల సమయంలో సీఎం చంద్రబాబు శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్తున్నారు. కాగా, సీఎం వాహనశ్రేణి ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ దగ్గరికి రాగానే ఆకస్మాత్తుగా ఓ వ్యక్తి జాతీయ రహదారిపైకి దూసుకొచ్చాడు.

పోలీసులు, స్థానికులు పెద్దపెట్టున అరవడం, డ్రైవర్లు అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు ఆ తర్వాత గుర్తించారు. దీంతో అతడ్ని చెంప దెబ్బ కొట్టి అక్కడ్నుంచి పంపించివేశారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+