సుజనాపై సీబీ’ఐ‘ : మరో నోటీసు జారీ

హైదరాబాద్ : బెస్ట్ అండ్ క్రాంప్టన్ సంస్థ తీసుకున్న లోన్ మాజీ కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి మెడకు చుట్టుకుంది. ఆ కంపెనీ ఆంధ్రాబ్యాంకును మోసం చేసిందని సుజనా చౌదరికి ఇదివరకే సీబీఐ నోటీసులు జారీచేసింది. అయితే విచారణకు ఆయన హాజరుకాలేదు. దీంతో మరోసారి సీబీఐ నోటీసు జారీచేసింది.

cbi again notice to sujana choudary

ఈ నెల 26నే నోటీసులు

ఈ వ్యవహారానికి సంబంధించి బెంగళూరు సీబీఐ కార్యాలయానికి రావాలని ఈ నెల 26న నోటీసులు జారీచేసింది. దీంతో సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయిచారు. సీబీఐ నోటీసు రద్దు చేయాలని కోరారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ సంస్థతో తనకు సంబంధం లేదని .. తన పేరు దెబ్బతీసేందుకు నోటీసులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఇదే కేసుకు సంబంధించి సీబీఐ మరోసారి నోటీసు జారీచేసింది. మే 4న జరిగే విచారణకు హాజరుకావాలని స్పష్టంచేసింది. ఈ సారి కూడా సుజనా హాజరుకాకుంటే .. సీబీఐ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+