వివేకా లేఖకు నిన్ హైడ్రైడ్ టెస్ట్-కోర్టు అనుమతి కోరిన సీబీఐ- అసలేంటీ పరీక్ష ?
ఏపీలో సంచలనాలు రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఒక్కో నిందితుడినీ అరెస్టు చేసి జైలుకు పంపుతున్న సీబీఐ.. ఇప్పుడు మరో నిందితుడు చేసిన ఆరోపణల ఆధారంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీనికి సీబీఐ కోర్టు అనుమతిస్తే మరో కీలక ఆధారం బయటపడటం ఖాయంగా కనిపిస్తోంది.
వైఎస్ వివేకా హత్య సమయంలో నిందితులు ఆయనతో బలవంతంగా ఓ లేఖ రాయించారని సీబీఐ ఆరోపిస్తోంది. హత్య ఘటనా స్ధలిలో లభించిన ఈ లేఖలో డ్రైవర్ ప్రసాద్ ఆలస్యంగా వచ్చావని ప్రశ్నించినందుకు దారుణంగా కొట్టి చంపేస్తున్నాడంటూ లేఖలో వివేకా ఆరోపించినట్లు సీబీఐ రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో వివేకా రాశారని చెబుతున్న లేఖ కీలకంగా మారింది. ఈ లేఖను 2021 ఫిబ్రవరిలోనే సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపింది. తీవ్ర ఒత్తిడిలో వివేకాయే ఈ లేఖ రాసినట్లు రిపోర్టు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ సీబీఐ ఈ లేఖపై వేలిముద్రల్ని గుర్తించేందుకు మరో పరీక్ష చేయాలని నిర్ణయించింది.

అయితే అసలు ఈ నిన్ హైడ్రైడ్ టెస్ట్ అంటే ఏంటనే చర్చ జరుగుతోంది. ఈ పరీక్షను ఏదైనా పేపర్ లేదా పదార్ధాలపై పడిన వేలు ముద్రల్ని గుర్తించేందుకు వాడతారు. వేలు ముద్రల్ని గుర్తించేందుకు ఎన్నో పరిజ్ఞానాలు ఉన్నప్పటికీ అవి పరిమిత కాలానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ ఇప్పుడు వివేకా హత్య జరిగి నాలుగేళ్లవుతోంది. ఇంత సుదీర్ఘకాలం ఆ లేఖపై వేలిముద్రలు అలాగే ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ టెస్ట్ ద్వారా వేలిముద్రల్ని గుర్తించే అవకాశముంది.
వాస్తవానికి సీబీఐ ఈ పరీక్ష చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. సీబీఐ ఇప్పటివరకూ ఈ కేసులో అరెస్టు చేసిన వారంతా తాము అమాయకులమే అని చెప్పుకుంటున్నారు. అలాగే అరెస్టు కాని నిందితుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా తనను సీబీఐ ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్ హైడ్రైడ్ పరీక్ష ద్వారా వివేకా లేఖపై వేలిముద్రలు గుర్తిస్తే కచ్చితమైన నిందితులు బయటపడతారని భావిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications