జగన్ హైదరాబాద్ విడువొద్దు: పిటిషన్‌పై సిబిఐ కౌంటర్

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాదు విడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వవద్దని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) నాంపల్లి ప్రత్యేక కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఇడుపులపాయ, గుంటూరు వెళ్లేందుకు తనకు అనుమతివ్వాలని జగన్ ఇటీవల న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకున్నారు.

దీనిపై సిబిఐ ఈ రోజు నాంపల్లి న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేసింది. హైదరాబాదు విడిచి వెళ్లరాదనే షరతు నుంచి జగన్‌కు మినహాయింపు ఇవ్వరాదని కౌంటర్‌లో పేర్కొన్నారు. ఆయన నగరాన్ని విడిచి వెళితే జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తారని సిబిఐ పిటిషన్‌లో పేర్కొంది.

YS Jagan

కాగా, నిరుడు మే 27న ఆస్తుల కేసులో అరెస్టైన వైయస్ జగన్ వారం రోజుల క్రితం జైలు నుండి విడుదలైన విషయం తెలిసిందే. అనంతరం ఆయన తన స్వగ్రామం ఇడుపులపాయ వెళ్లడానికి తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తమ అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు జగన్‌కు షరతు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించేందుకు అక్టోబర్ 1, 2 తేదీల్లో ఇడుపులపాయకు వెళ్లడానికి అనుమతించాలని జగన్ కోర్టును కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+