సీఎం జగన్, సాయిరెడ్డికి కోర్టు రిలీఫ్ - సీబీఐ అభ్యంతరాల తిరస్కరణ..!!
ముఖ్యమంత్రి జగన్..ఎంపీ విజయ సాయిరెడ్డికి సీబీఐ కోర్టులో రిలీఫ్ దొరికింది. విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్..విజయ సాయిరెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చింది. వీరిద్దరికి అనుమతి ఇచ్చే అంశంలో న్యాయస్థానం లో సీబీఐ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. సీబీఐ అభ్యంతరాలను తోసిపుచ్చిన కోర్టు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కుటుంబ సభ్యుల తో కలిసి యూకే వెళ్లనున్నారు.
సీఎం జగన్ తన కుమార్తె వద్దకు లండన్ కు వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఇందు కోసం సీబీఐ కోర్టు అనుమతి కోరారు. గతంలో ఉన్న కేసుల్లో భాగంగా విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి పొందాల్సి ఉంది. ఈ మేరకు కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరగా, విచారణ సమయంలో సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ లో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అనుమతి ఇవ్వద్దంటూ కోర్టును అభ్యర్దించింది. దీని పైన విచారణ చేసిన న్యాయస్థానం సీఎం జగన్ కు పది రోజుల పాటు ఫ్యామిలీతో కలిసి యూకే వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.

అదే సమయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి తన విదేశీ పర్యటనకు సంబంధించి అనుమతి కోరుతూ కోర్టులో పిటీషన్ ధాఖలు చేసారు. రానున్న రెండు నెలల్లో చేయనున్న విదేశీ పర్యటనలకు అనుమతి కోరారు.యూఎస్, యూకే, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో సాయిరెడ్డి పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పిటీషన్ విచారణ నిర్వహించిన కోర్టు ఈ రోజు నిర్ణయం వెలువరించింది. సాయిరెడ్డి అభ్యర్ధన మేరకు సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు నెల రోజుల పాటు విజయ సాయి రెడ్డి కి విదేశీ టూర్ కు అనుమతి ఇస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications