మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం : డైరెక్ట్ ఫైట్..!!
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక నిర్ణయం ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వేదికగా జరగుతున్న నిర్ణయాలు..రాజకీయంలో కొత్త పాత్రకు సిద్దమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ కు బిడ్ దాఖలుకు ఈ మధ్నాహ్నంతో సమయం ముగియనుంది.
బిడ్ దాఖలు చేసేందుకు ముందుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఫైనల్ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రయివేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లటం లేదన్న కేంద్రం..ఇంతలోనే మాట మార్చింది. ప్రయివేటీకరణ ఆగదని తేల్చి చెప్పిందది. ఈ సమయంలో సీబీఐ మాజీ జేడీ కీలక నిర్ణయానికి ముహూర్తం ఫిక్స్ చేసారు.

స్టీల్ ప్లాంట్ పోరాటంలో మరో అడుగు:ప్రయివేటీకరణ ఆగదంటూ కేంద్రం స్పష్టత ఇచ్చింది. కేంద్ర సహాయ మంత్రి విశాఖలో ప్రస్తుతానికి ప్రయివేటీకరణ పైన ముందుకు వెళ్లటం లేదని..స్టీల్ ప్లాంట్ బలోపేతం చేయటం పైనే ఫోకస్ చేసామని చెప్పుకొచ్చారు. దీంతో, ప్రయివేటీకరణ ఆగిందంటూ రాజకీయ పార్టీలు ఎవరికి వారు క్రెడిట్ కోసం ప్రయత్నించాయి.
ఇంతలో కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. స్టీల్ ప్లాంట్ లో ప్రభుత్వ పెట్టుబడుల ఉప సంహరణ కొనసాగుతుందని ప్రకటించారు. దీంతో, బిడ్ దాఖలుకు గడువు ముగుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం బిడ్ దాఖలు చేస్తుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సమయంలోనే ప్రయివేటు సంస్థలు ఏవి బిడ్లు దాఖలు చేస్తున్నాయనే ఉత్కంఠ కొనసాగుతోంది. అటు కార్మిక సంఘాలు తమ పోరాట తీవ్రను పెంచాయి.
బిడ్ దాఖలుకు నిర్ణయం:విశాఖ ఉక్కు పోరాట కమిటీ భారీ పాదయాత్ర నిర్వహించింది. స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం వరకు ఈ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో పాల్గొని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కార్మికులకు మద్దతు ప్రకటించారు. కీలక ప్రకటన చేసారు. తాను స్టీల్ ప్లాంట్ ప్రకనట మేరకు ప్రజల తరపు బిడ్ దాఖలు చేస్తానని ప్రకటించారు. ఈ రోజు జరిగిన పాదయాత్ర ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించారు.
ప్రయివేటీకరణ కేంద్రం విధానమైతే..ప్రజలు ఎలా తిప్పి కొడతారో చూడాలని వ్యాఖ్యానించారు. తాన చట్టం చదివానని..స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించిన తరువాతనే నిర్ణయం తీసుకున్నానని లక్ష్మీనారాయణ వెల్లడించారు. దీని ద్వారా ఏం జరుగుతుందో లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.
రాజకీయంగా ఏపీ పార్టీలపై ఒత్తిడి:తాము బిడ్ దాఖలు చేస్తే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తమను పిలుస్తారని..మాట్లాడుతారని వివరించారు. తాము చెప్పదలచుకున్నది చెబుతామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్ దాఖలుకు ముందుకు రావటంతో ఏపీ కూడా రావాలని తాము ఆహ్వానించామని గుర్తు చేసారు. ఎవరెవరు బిడ్లు దాఖలు చేస్తారో స్పష్టత వచ్చిన తరువాత కార్యాచరణ ఖరారవుతుందని చెప్పారు.
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తాము స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం..ప్రధానికి లేఖలు రాసిన అంశాన్ని చెప్పుకొస్తోంది. పవన్ కల్యాణ్ తాము అమిత్ షా ను కలిసి కోరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ రాజకీయంగా అడుగులు వేస్తోంది. ఈ సమయంలో ఇప్పుడు లక్ష్మీనారాయణ బిడ్ దాఖలు చేస్తే...పరోక్షంగా మూడు ప్రధాన పార్టీలపైన ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications