అవినాశ్ అరెస్ట్ కు బయలుదేరాం, బెయిల్ ఇవ్వద్దు - సీబీఐ..!!
ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైఎస్ వివేకా కేసులో అవినాశ్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అవినాశ్ తరపు న్యాయవాది సుదీర్ఘ వాదనలు వినిపించారు. దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని వివరించారు.
సునీత తరపు న్యాయవాది అవినాశ్ మైండ్ గేమ్ ఆడుతున్నారని పేర్కొన్నారు. పిటీషన్ కొట్టివేయాలని కోరారు. సీబీఐ కీలక వాదనలు వినిపించింది. అరెస్ట్ కు బయలుదేరామని..కర్నూలు పరిణామాలను వివరించింది. ఈ రోజు కోర్టు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

బెయిల్ పిటీషన్ పై విచారణ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు అవినాశ్ బెయిల్ పిటీషన్ పై విచారణ ప్రారంభించింది. అవినాశ్ తరపు న్యాయవాది తన వాదనల్లో హత్య అనంతరం పోలీసులు, సిట్ దర్యాప్తు అంశాలకు చెందిన కేసు డైరీని మూడేళ్లయినా కోర్టుకు సమర్పించలేదన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం కౌంటర్ లోని అంశాల ఆధారంగా నిందితుడని ముద్ర వేస్తున్నారని కోర్టుకు నివేదించారు. అవినాశ్ తల్లి అనారోగ్యంతో ఉన్న సమయంలో ఈ హడావుడి ఎందుకని ప్రశ్నించారు. సీబీఐ సాక్ష్యులను బెదిరించినట్లు చెబుతోంది.. ఎక్కడా బెదిరించారో చెప్పాలని కోర్టును కోరారు. అటు కర్నూలు ఆస్పత్రి నుంచి తన తల్లిని అవినాశ్ హైదరాబాద్ కు తరలించారు.
అఫిడవిట్ లో కీలక అంశాలు: ఇదే సమయంలో సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ లో కీలక అంశాలను ప్రస్తావించింది. అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిలు ఇవ్వొద్దని సీబీఐ హైకోర్టును అభ్యర్థించింది. వివేకా హత్య కేసులో విస్తృత కుట్ర తేలాలంటే ఆయనను అరెస్టు చేసి, కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈనెల 16వ తేదీ నుంచి మూడుసార్లు విచారణకు గైర్హాజరయ్యారని వివరించింది.
ఈనెల 22వ తేదీన అవినాశ్ రెడ్డిని కర్నూలులో అరెస్టు చేసేందుకు వెళ్లినప్పటికీ అక్కడ పరిస్థితులు అనుకూలించలేదని సీబీఐ వెల్లడించింది. ఆస్పత్రి వద్ద అనచరులు పెద్ద సంఖ్యలో రావటంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉండటంతో... అవినాశ్‌ను అరెస్టు చేసేందుకు కర్నూలు ఎస్పీ సహకారం కోరామని వివరించింది. జూన్ 30వ తేదీలోగా ఈ కేసులో దర్యాప్తును ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేసింది.

వైఎస్ సునీత వాదనలు: ఇదే సమయంలో వైఎస్ సునీత తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. కొత్త థియరీలో అవినాశ్ కొత్తగా మైండ్ గేమ్ ప్రారంభించారని పేర్కొన్నారు. నోటీసులు ఇస్తే పలు కారణాలతో సహకరించకుండా ఇప్పుడు ఇంత కాలం ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారని వివరించారు.
ఎప్పుడు అరెస్ట్ చేయాలనేది విచారణ సంస్థ విచక్షణాధికారమని స్పష్టం చేసారు. హత్య జరిగిన రోజున అవినాశ్ జమ్మలమడుగు వెళ్తూ చిన్నాన్న హత్య గురించి తెలుసుకుని వెనక్కి తిరిగి వచ్చినట్లు మొసలి కన్నీరు కారస్తున్నారని..పిటీషన్ కొట్టేయాలని కోరారు. ఈ రోజు సీబీఐ వాదనలు కోర్టు విన్న తరువాత అవినాశ్ బెయిల్ పిటీషన్ పైన తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications