CBSE బిగ్ డెసిషన్: ఒక సబ్జెక్ట్‌లో ఫెయిలైనా టెన్త్ పాస్ అయ్యే ఛాన్స్..!!
సీబీఎస్‌ఈ పదో తరగతి బోర్డు పరీక్షల విధానంలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించి, వారికి నైపుణ్య ఆధారిత విద్యను అందించే దిశగా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 2027-28 విద్యా సంవత్సరం టెన్త్ పరీక్షల విధానంలో సరికొత్త మార్పులను తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదానిలో ఫెయిల్ అయినప్పటికీ.. అదనంగా ఎంచుకున్న స్కిల్ సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధిస్తే పాస్ అయినట్లుగా పరిగణిస్తారు.
సీబీఎస్‌ఈ పదో తరగతి బోర్డు పరీక్షలు.. మార్కుల విధానంలో కీలక మార్పులు జరిగాయి. తాజాగా తీసుకొచ్చిన మార్పుల ప్రకారం కొత్త విధానం ప్రకారం.. విద్యార్థులు ఐదు తప్పనిసరి సబ్జెక్టులతో పాటు అదనంగా ఒక నైపుణ్య ఆధారిత (స్కిల్) సబ్జెక్టును ఎంచుకునే అవకాశం ఉంటుంది. గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదానిలో ఫెయిల్ అయినప్పటికీ.. అదనంగా ఎంచుకున్న స్కిల్ సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధిస్తే పాస్ అయినట్లుగా పరిగణిస్తారు. ఈ మేరకు సీబీఎస్‌ఈ స్పష్టత ఇచ్చింది.

కొత్త విధానం ప్రకారం విద్యార్థులు రెండు భాషలు, గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం కలిపి ఐదు సబ్జెక్టులకు తప్పనిసరిగా బోర్డు పరీక్షలు రాయాలి. అయితే మొత్తం తొమ్మిది తప్పనిసరి పాఠ్యాంశాలను అభ్యసించాల్సి ఉంటుంది. వీటిలో మూడో భాష, కళా విద్య, శారీరక విద్య, ఆరోగ్యం, వృత్తి విద్య కూడా ఉంటాయి.
అయితే, ఈ కొత్త నిబంధన 2027-28 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానుంది. ఇక.. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, అంటే 2028లో పదో తరగతి బోర్డు పరీక్షలు రాసేవారికి మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. ప్రస్తుతం (2026-27) పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నిబంధన వర్తించదు. వారు పాత విధానంలోనే పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
కఠినమైన సబ్జెక్టుల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని తగ్గించి, ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించడంలో ఈ విధానం ఎంతో దోహదం చేస్తుందని నిపుణు లు చెబుతున్నారు. దీని ద్వారా ఐదు తప్పనిసరి బోర్డు పరీక్షలతో పాటు ఆప్షనల్ స్కిల్ సబ్జెక్ట్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మ్యాథ్స్, సైన్స్, సోషల్‌లో ఏదైనా ఒక సబ్జెక్టులో ఫెయిలైనా, స్కిల్ సబ్జెక్టులో పాసైతే ఆ సబ్జెక్టుతో రీప్లేస్ చేసుకునే అవకాశం కల్పిస్తూ నిర్ణయం ప్రకటించారు.












Click it and Unblock the Notifications
