Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీవీ నటి విజయరాణిని ప్రశ్నిస్తున్న పోలీసులు

 CCS police question Vijayarani in cheating case
హైదరాబాద్: అధిక వడ్డీలు, చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి, మోసం చేసిన టీవీ నటి విజయరాణిని హైదరాబాద్ నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. బెంగళూర్‌లోని విద్యారణ్య కాలనీలోని తన బంధువుల ఇంట్లో ఉన్న ఆమెను పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ తరలించారు.

తోటి నటీనటుల నుంచి, స్థానికుల నుంచి అధిక వడ్డీ ఆశ చూపి విజయరాణి 3 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడిందని అంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో విజయరాణి అరెస్టును అధికారికంగా చూపించే అవకాశం ఉందని అంటున్నారు.

చిట్టీల పేరుతో ఏడు కోట్ల రూపాయల మేరకు తోటి కళాకారులను, స్థానికులను ముంచి టీవి ఆర్టిస్టు విజయరాణి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. నెల రోజులుగా ఆమె తప్పించుకుని తిరుగుతున్నారు. ఆమెతో పాటు మరో పదిమందిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

విజయరాణి ఆచూకీ లేక పోవడంతో తాము మోసపోయామని గ్రహించిన జూనియర్ ఆర్టిస్టులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. రాత్రింభవళ్లు కష్టపడి పిల్లల భవిష్యత్ కోసం చిట్టీలు వేస్తున్నామని, విజయరాణి ఇలా మోసం చేస్తుందని ఊహించలేదని బాధితులు గగ్గోలు పెట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+