ఉప్పొంగిన ఉస్మానియా: కలసి మెలసి (పిక్చర్స్)
హైదరాబాద్: అలుపెరుగని దశాబ్దాల తెలంగాణ బిడ్డల పోరాటం ఫలించిన వేళ తెలంగాణా అమరవీరుల ఆశయాలు సిద్ధించిన సమయాన ఆకాశమే హద్దుగా ఉప్పొంగిన సంబరాలతో యావత్ తెలంగాణ ప్రజలు మునిగి తేలారు.
పార్లమెంట్‌లో బిల్లు చర్చ జరుగుతుందని తెలిసి విద్యార్థులు అధ్యాపకులు, సాధారణ ప్రజలు సైతం టివిలకే అతుక్కుపోయారు. మధ్యాహ్నం ఒకింత ఆందోళనకు గురైనప్పటికీ కూడా చివరకు తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థులు కేరింతలతో క్యాంపస్‌లో పరుగులు తీస్తూ ఆర్ట్స్ కళాశాల ముందుకు చేరుకున్నారు.
దీంతోపాటు అధ్యాపకులు క్యాంపస్‌తో అనుబంధం ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలు విద్యార్థులు యువకులు సైతం పెద్దయెత్తున క్యాంపస్‌కు చేరుకున్నారు. క్షణాల్లో వేలాదిగా యువతరం తెలంగాణ నినాదాలు చేస్తూ వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ బాణసంచా కాలుస్తూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

కలిసి మెలసి...
తెలంగాణ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కేరింతలు కొట్టింది. పోలీసులకు, విద్యార్థులకు మధ్య రణక్షేత్రంగా మారిన ఓయు ఇప్పుడు కలిసి మెలసి సంబరాలు చేసుకుంది.

ఉస్మానియా కేరింతలు..
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు కేరింతలు కొట్టారు. ఆడారు, పాడారు. సంబురాలు చేసుకున్నారు.

ఆడారు, పాడారు..
మొన్నటివరకు పోలీసుల కాల్పులతో నిర్బంధాలతో కొనసాగిన క్యాంపస్‌లో స్వేఛ్చాయుత వాతావరణంలో విద్యార్థులు ఆనందోత్సాహాలతో బాణసంచాలను కాల్చారు.

సోనియాకు కృతజ్ఞతలు
తెలంగాణ కల సాకారం కావడంతో ఉస్మానియాలోని ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు సోనియా చిత్రపటాన్ని ఎగురవేశారు.

ఆనందానికి అవధులు లేవు
రంగులు చల్లుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఓయు ఉపకులపతితోపాటు ఆచార్యులందరూ ఆనందంతో కేరింతలు కొడుతూ విద్యార్థులతో మమేకమై సంబరాలు జరుపుకున్నారు.

బాణసంచా కాల్చారు..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఉస్మానియా విద్యార్థులు బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.

ఇదే దీపావళి..
ఉస్మానియా విశ్వవిద్యాలయం గురువారం రాత్రి దీపావళి పండుగను తలపించే విధంగా మిరుమిట్లు గొలిపింది.

ఉద్యమాల పురుటిగడ్డ
ఉద్యమాల పురుటి గడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు కేరింతలు కొట్టారు, నృత్యాలు చేశారు.

కాకరపుల్లల కాంతులు..
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు కూడా ఆనందోత్సహాల్లో మునిగిపోయారు. చిన్నారులు కాకరపుల్లల కాంతుల్లో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కేక్ కట్ చేశారు..
పోలీసు బాస్‌లతో విద్యార్థులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. కేక్ కట్ చేసి నూతన రాష్ట్రానికి స్వాగతం చెప్పారు.

అధ్యాపకులతో కలిసి..
అధ్యాపకులతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులంతా కలిసిపోయారు.












Click it and Unblock the Notifications