జాగ్రత్త అవసరం! చేతిలో పేలిన సెల్‌ఫోన్: తెగిపడిన బాలుడి వేళ్లు
కర్నూలు: సెల్ ఫోన్ ఎంత ప్రమాదకరమో ఈ ఘటనను చూస్తే తెలుసిపోతుంది. జిల్లాలోని తుగ్గలి మండలం పెండేకల్లులో ఓ బాలుడి చేతిలో సెల్‌ఫోన్ పేలింది. దీంతో చేతికి తీవ్ర గాయాలైయ్యాయి. దాదాపు వేళ్లు తెగిపోయాయి.
వివరాల్లోకి వెళితే.. ఆదివారం వడ్ల మద్దిలేటి ఆచారి పెద్ద కుమారుడు జనార్ధన్ ఆచారి కుడి చేతిలో సెల్‌ఫోన్ పట్టుకొని పాటలు వింటుండగా బ్యాటరీ పేలిపోయింది. పేలుడు ధాటికి బాలుడి చేతి వేళ్లు రెండు తెగి నేలపై పడ్డాయి.

ఇంటి బయట వడ్రంగి పని చేస్తున్న తండ్రి లోనికి వెళ్లి చూసేసరికి బాలుడు చేయి రక్తంతో కనిపించింది. చేతికి తీవ్ర గాయంతో బాలుడు హాహకారాలుచేస్తూ తండ్రి వద్దకు వచ్చారు.
వెంటనే.. తెగి నేలపై పడిన వేళ్లను కవర్‌లో వేసుకొని ఆటోలో బాలుడిని పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి మూడవ తరగతి చదువుతున్నాడు. కాగా, సెల్ ఫోన్ కెచడా అనే చైనా కంపెనీకి చెందినదని స్థానికులు తెలిపారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications